మన చేత్త వల్ల ఎంతమంది పిల్లల ఆరోగ్యానికీ, భవిష్యత్తుకీ ముప్పు వస్తోందో ఎవరైనా ఆలోచించారా? ఈ సమస్య ఎక్కడో కాదు – మన హైదరాబాద్ నగరంలోనే తీవ్రమవుతోంది. జవహర్ నగర్‌లోని చెత్త డంపింగ్ యార్డు 339 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రతిరోజూ సుమారు 8,000 మెట్రిక్ టన్నుల చెత్త ఈ ప్రాంతంలో వేస్తున్నారు. ఒక నెలలో 20 రోజులకు లెక్క వేస్తే 1,67,561 మెట్రిక్ టన్నులు, దాదాపు 14,364 లారీలు ఈ ప్రాంతాన్ని చెత్తతో నింపుతున్నాయి.

ఇక్కడి పరిసరాల్లో సుమారు 18 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. కేవలం 300 మీటర్ల దూరంలో రాజీవ గృహాలు – 4,521 కుటుంబాలు, 700 మీటర్లకు KCR డబుల్ బెడ్‌రూం ఇండ్లు – 4,428 కుటుంబాలు, ఒక కిలోమీటరు దూరంలో ఇందిరమ్మ ఇండ్లు – 500 కుటుంబాలు నివసిస్తున్నాయి.

ప్రజల్లో అంచనా ప్రకారం 20% మంది పిల్లలే ఉండగలరని గణన. అంటే దాదాపు 40,000 పిల్లలు ఈ చెత్త ప్రభావాన్ని నిత్యం ఎదుర్కొంటున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితులు ప్రశ్నార్థకంగా మారాయి – వాయు కాలుష్యం వల్ల శ్వాస సంబంధిత రోగాలు, లంగ్ ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, స్కిన్ ప్రాబ్లమ్స్ వంటి సమస్యలు ఉదయించాయి.మన చెత్త వల్ల ఒక తరానికి విద్య, ఆరోగ్య భద్రత ముప్పులో పడితే – బాధ్యత ఎవరిది?
ప్రశ్న మనందరిదీ. పరిష్కారం కోసం చర్యలు కూడా మనదే. బాలల హక్కుల సంఘం ఆవేదన చెందుతూ డంపింగ్ యార్డ్ అక్కడి నుండి తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న అద్యక్షురాలు అనురాధరావు

Loading

By admin

error: Content is protected !!