ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేయనున్నారు. స్కూల్స్‌లో ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్‌తో పాటు ఉచిత వసతులు అందుబాటులోకి రానున్నాయి. గురుకులాల కోసం డైట్ ఛార్జీలు 40%, కాస్మోటిక్ ఛార్జీలు 200% పెంపు చేశారు. విద్యార్థులకు ఉచిత సాయంత్రం స్నాక్స్ పథకం అమలు చేయనున్నారు.
ఆరోగ్యశ్రీ పరిధి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. కొత్తగా 1,835 వైద్య చికిత్సలు ఆరోగ్యశ్రీలో చేర్చారు. 90 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి కల్పించనున్నారు. ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ఖర్చు 20% పెంపు చేశారు.
రాష్ట్రం మొత్తం రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,79,751, దేశ సగటు రూ.2,05,579తో పోలిస్తే 1.8 రెట్లు ఎక్కువ. రాష్ట్ర వృద్ధిరేటు 9.6% అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
రైతులకు భారీ రుణమాఫీ
రైతులకు రూ.20,616 కోట్లు రుణమాఫీ అమలు చేయనున్నారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.12,000, ఈ పథకానికి రూ.18,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్, 40 లక్షల ఎకరాల్లో సన్న వడ్ల సాగు విస్తరణ చేపట్టనున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య 8,332కి పెంపు, వడ్ల బోనస్ కింద రూ.1,206 కోట్లు చెల్లింపు.
ఆయిల్ ఫామ్ సాగుకు టన్నుకు రూ.2,000 అదనపు సబ్సిడీ. తెలంగాణలో నిరుద్యోగ రేటు 22.9% నుంచి 18.1%కి తగ్గింపు. 57,946 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. తెలంగాణ డిజిటల్ ఉపాధి కేంద్రం పునరుద్ధరణ, రాజీవ్ యువ వికాస పథకానికి రూ.6,000 కోట్లు కేటాయించారు. బీఎఫ్ఎస్ఐ రంగంలో విద్యార్థులకు ప్రత్యేక కోర్సులు అందుబాటులోకి రానున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
తెలంగాణ బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట – భట్టి విక్రమార్క
శాఖల వారీగా కేటాయింపులు:
పౌర సరఫరాల శాఖ – ₹5,734 కోట్లు
పరిశ్రమల శాఖ – ₹3,527 కోట్లు
రోడ్లు, భవనాల శాఖ – ₹5,907 కోట్లు
పట్టణాభివృద్ధి – ₹17,677 కోట్లు
పంచాయతీ రాజ్ శాఖ – ₹31,605 కోట్లు
బీసీ సంక్షేమం – ₹11,405 కోట్లు
ఎస్సీ సంక్షేమం – ₹40,232 కోట్లు
ఎస్టీ సంక్షేమం – ₹17,169 కోట్లు
మైనారిటీల సంక్షేమం – ₹3,591 కోట్లు
ఐటీ శాఖ – ₹7,704 కోట్లు
ప్రత్యేక పథకాల కోసం కేటాయింపులు:
మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం – ₹5,005 కోట్లు
ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం – ₹433 కోట్లు
ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుపై మంజూరు
6 గ్యారెంటీల అమలుకు ₹56,084 కోట్లు కేటాయించారు.
మహాలక్ష్మి పథకం – ₹4,305 కోట్లు
గృహజ్యోతి (ఉచిత విద్యుత్) – ₹2,080 కోట్లు
సన్న బియ్యం బోనస్ – ₹1,800 కోట్లు
రాజీవ్ ఆరోగ్య శ్రీ – ₹1,143 కోట్లు
గ్యాస్ సిలిండర్ సబ్సిడీ – ₹723 కోట్లు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా – ₹600 కోట్లు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ సంక్షేమాన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించామని, రాష్ట్రంలోని అన్ని వర్గాలను పరిరక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.