1) వి కే ఓ సి పి ప్రైవేట్ వారితో కాకుండా సింగరేణి యాజమాన్యం చేయాలి, కార్మికులందరినీ ఏరియాలోని అడ్జస్ట్ చేయాలి.
2) జే వి ఆర్ ఓ సి పి నందు డంపర్స్, డోజర్స్, శవల్స్, గ్రేడర్స్, ఎస్కార్ట్స్ కాలం చెల్లిన హెచ్సీఎంఎం స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేస్తూ, హెవీ కెపాసిటీ వాటర్ ట్యాంకర్స్ ఏర్పాటు చేయాలి.
3) హైదరాబాద్ రిఫెరల్ మీద ఆపరేషన్ ఉన్న ప్రతి కార్మికుడికి వారి కుటుంబ సభ్యులకు వేల రూపాయల ముందు కట్టాల్సిన అవసరం వస్తుంది,అట్లా కట్టకుండా చూడాల్సిందిగా కోరుతున్నాం, కట్టిన వారికి అమౌంట్ వెనకకు వచ్చే విధంగా చూడాలి, మెరుగైన వైద్యం అందించాలి.
4) సమంత సిహెచ్పి, ఆర్ సి హెచ్ , క్వారీలలో వాటర్ ప్రాబ్లమ్ తో పాటు హెవీ డస్ట్ వస్తున్నది, ఆ సమస్యను త్వరగా పరిష్కరించ గలరు.
5) ఓసిపిసి వర్కింగ్ ప్లేసెస్ నందు రెస్ట్ షెల్టర్స్ మరియు షెల్టర్స్ ఏర్పాటు చేస్తూ వాటర్ మరియు కూలర్ ఏర్పాటు చేయాలి.
6) పి వి కే 5 నందు మహిళ అధికారులు,ఉద్యోగులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు గాన వారికి సంబంధించి మౌలిక సదుపాయాలు వెంటనే ఏర్పాటు చేయాలి.
7) సెక్యూరిటీ చెక్ పోస్ట్ లలో ఏసీలు ఏర్పాటు చేయాలి(G-8, పివికే చెక్ పోస్ట్, న్యూ ఆర్ సి ఎస్ పి చెక్ పోస్ట్)
8) సత్తుపల్లి హవె మీద ఎక్కువ ఎక్కువ ఆక్సిడెంట్లు అవుతున్నాయి గానా, మనకు సంబంధించిన వారు హైవే ఎక్కకుండా డిస్పెన్సరీ నుండి ఈ పి సి ఎస్ పి వరకు రోడ్డు ఏర్పాటు చేయాలి.
9) ఏరియాలో ఉన్న మైన్స్,ఓ.సి.పి మరియు డిపార్ట్మెంట్స్ లలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వేసవికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ, ఓ ఆర్ ఎస్, కూల్ వాటర్ తో పాటు, మజ్జిగ ప్యాకెట్లను 90 రోజులు ఇవ్వాలి.
10) కిష్టారం ఓసిపి నందు ఏసీలు లేని ఫిట్నెస్ లేని హెచ్ ఈ ఎం ఎం వాహనాలు నడుపుతున్నారు,( ఆఫ్ లోడింగ్ మరియు అవుట్ సోర్సింగ్) అదేవిధంగా ఓవర్మెన్, ఫోర్ మేన్స్, మాన్ పవర్ తక్కువగా ఉన్నారు. వారిని ఫుల్ ఫిల్ చేయగలరని, పై సమస్యలన్నీ త్వరగా పూర్తి చేయాలని కోరడమైనది .