తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగమంటున్నాయి. మార్చిలోనే మే నెల వేడిమి కనిపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 11 గంటల తర్వాత ఎండ దాహం చేసేస్తోంది. ఇప్పటికే 42°C దాటిన ఉష్ణోగ్రతలు వడగాలులతో కలసి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అత్యవసర పనులు తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. మంగళవారం 128 మండలాల్లో వడగాలులు, 29 మండలాల్లో తీవ్ర వడగాలులు నమోదయ్యే అవకాశముందని APSDMA ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. నిన్న ఏపీలో పార్వతీపురంలో 42.8°C, విజయనగరంలో 42.6°C, అనకాపల్లిలో 42.1°C వంటి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తెలంగాణలోనూ తీవ్ర ఎండలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. 22 జిల్లాల్లో 40°C పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న ఆదిలాబాద్ 40.3°C, నిజామాబాద్ 40.1°C, భద్రాచలం 40°C, మహబూబ్‌నగర్ 40°C, హైదరాబాద్ 39.2°C నమోదయ్యాయి. వడగాలుల ప్రభావం అధికంగా ఉండడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం అత్యవసరమైతేనే బయటకు రావాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.

Loading

By admin

error: Content is protected !!