బ్యాంక్ రికవరీ ఏజెంట్లు కస్టమర్లను ఇష్టం వచ్చినప్పుడు కాల్ చేయడం, వేధించడం నిబంధనలకు విరుద్ధం. ఆర్‌బీఐ మార్గదర్శకాలు ప్రకారం:
కాలింగ్ సమయం: ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సెలవు దినాలు, పండగ రోజుల్లో సంప్రదించకూడదు.
అపమానం నిషేధం: కస్టమర్‌ను తిట్టడం, అతని ఆర్థిక స్థితిని పదిమందిలో విమర్శించడం నిషేధం.
తప్పనిసరి గుర్తింపు: రికవరీ ఏజెంట్ ఐడెంటిటీ కార్డు, బ్యాంకు ఆథరైజ్ లెటర్ చూపించాల్సిందే.
ప్రైవసీ హక్కు: కస్టమర్‌కు తెలియకుండా మిత్రులను, బంధువులను సంప్రదించడం నిషేధం.
మీ హక్కులు:
రికవరీ ఏజెంట్లు ఈ నియమాలు ఉల్లంఘిస్తే హరాస్మెంట్ కేసు ఫైల్ చేయవచ్చు. ఆర్‌బీఐ కు కంప్లయింట్ చేయడం, కన్స్యూమర్ కోర్ట్ ను ఆశ్రయించడం ద్వారా న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చు.