“ఒక్క విద్యార్థి – ఏదు ప్రభుత్వ ఉద్యోగాలు”

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రుద్రంపూర్ గ్రామానికి చెందిన యువ ప్రతిభావంతుడు మొహమ్మద్ హఫ్రీద్, ఒకే సంవత్సరంలో నాలుగు ప్రభుత్వ ఉద్యోగాల్లో సెలెక్ట్ అయి అందరి దృష్టిని ఆకర్షించాడు. అతను TSPSC, RRB NTPC, SSC CGL, జూనియర్ లెక్చరర్ పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి, ఏకకాలంలో ఏదు ఉద్యోగ అవకాశాలను సాధించాడు.

కుటుంబ నేపథ్యం:-
మొహమ్మద్ రజాక్, ఫాతిమా దంపతులకు ఇద్దరు కుమారులు , మొదటి కుమారుడు మొహమ్మద్ పాషా జూనేద్ MTECH, LLB పూర్తి చేసి వ్యాపారం చేస్తున్నాడు, రెండో కుమారుడు అయిన మొహమ్మద్ హఫ్రీద్ BE – మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టబద్ధుడై,MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశాడు. చదువుపై ఎనలేని ఆసక్తి ఉన్న అతను బీటెక్ పూర్తయ్యేలోపే పోటీ పరీక్షలపై దృష్టి పెట్టాడు.

RRB NTPC 2020 నోటిఫికేషన్ లో సెంట్రల్ గవర్నమెంట్ ట్రెయిన్ మేనేజర్ గా ఉద్యోగం సాధించి, తన ప్రిపరేషన్ కి అడ్డంకి అవుతుందని రిజైన్ చేసి పోటీ పరీక్షలపై దృష్టి పెట్టాడు.
ఆ క్రమం లో SSC CGL నోటిఫికేషన్ లో పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం సాధించాడు. ఆ తరువాత SCCL జూనియర్ అసిస్టెంట్ పరీక్షలో 171వ ర్యాంక్ సాధించాడు.
TSPSC గ్రూప్ 4 లో జిల్లా ఫస్ట్ వచ్చిన అతను ప్రస్తుతం రెవెన్యూ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన GROUP -1 లో 448 మార్క్స్ సాధించాడు, GROUP -2 లో 377 మార్క్స్ తో స్టేట్ 313 ర్యాంక్ సాధించాడు, GROUP -3 లో స్టేట్ 22nd ర్యాంక్ సాధించాడు. జూనియర్ లెక్చరర్ లో స్టేట్ 21వ ర్యాంక్ సాధించాడు.

“ఈ రోజు నా కృషికి ఫలితం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఎంపిక కావడం నాకు గర్వకారణం మాత్రమే కాకుండా, సమాజానికి సేవ చేసే గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. నా విజయానికి నా తల్లిదండ్రుల సహాయం అమూల్యమైనది. వాళ్లు నాకు పూర్తిగా మద్దతు అందించారు, ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూ ఉండేవారు. ముఖ్యంగా కఠిన సమయాల్లో వాళ్ల మద్దతు నాకు బలాన్నిచ్చింది” అని మొహమ్మద్ హఫ్రీద్ తెలిపాడు.
నా విజయానికి తోడ్పడిన నా కుటుంబ సభ్యులు, గురువులు, స్నేహితులు, మరియు మెంటార్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజల సంక్షేమానికి కృషి చేస్తూ, న్యాయసూత్రాలను అనుసరిస్తూ, నా బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తాను” అని మొహమ్మద్ హఫ్రీద్ తెలియజేశారు.

ఆరంభంలో కొన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ, తన నిరంతర కృషి, క్రమశిక్షణ, మరియు సమయపాలన వల్ల విజయాన్ని సాధించగలిగానని అంటున్నాడు. సరైన ప్రణాళిక వేసుకొని చదివితే, నిరంతరం ప్రయత్నిస్తే ప్రభుత్వ ఉద్యోగం సాధించటం సాధ్యమే” అని మొహమ్మద్ హఫ్రీద్ అభ్యర్థులకు సలహా ఇచ్చాడు.

కుటుంబ సభ్యుల ఆనందo:-

వారి కుమారుడు ఘన విజయాన్ని సాధించడంతో తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. “మా కుమారుడు చిన్నప్పటినుంచి కష్టపడే పిల్లాడు. చదువుపై ఆసక్తి ఎక్కువ. అతని కృషికి ఇవాళ ఫలితం వచ్చింది” అని తండ్రి మొహమ్మద్ రజాక్ ఆనందం వ్యక్తం చేశారు. తల్లి భావోద్వేగంతో మాట్లాడుతూ, “తన ప్రతి ప్రయత్నంలో మేము వెన్నుదన్నుగా నిలిచాం. ఇప్పుడు అతని కల నెరవేరింది. మాకు గర్వకారణంగా మారాడు” అని అన్నారు. ఈ ఘనత సాధించిన విద్యార్థికి శుభాకాంక్షలు తెలుపుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాం.

Loading

By admin

error: Content is protected !!