తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనితీరును విశ్లేషించేందుకు రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రత్యేక నెట్‌వర్క్ ఏర్పాటుతో పాటు కీలక చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోనే నివసిస్తున్న ఆమె, తన స్నేహితులు, మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు.

ఆమె ఇన్‌చార్జ్‌గా నియమితులైన మరుసటి రోజే రాష్ట్ర రాజకీయాలపై ఆరా తీసి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ప్రచారం సరైన విధంగా లేకపోవడం గమనించి, నేతలందరూ క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని ఆదేశించారు. అలాగే ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్‌ఎస్ చేస్తున్న విమర్శలను కూడా విశ్లేషిస్తున్నట్లు తెలుస్తోంది.

పార్టీ బలోపేతానికి కార్యాచరణ
కాంగ్రెస్‌ను సంస్థాగతంగా బలోపేతం చేయడానికి మీనాక్షి నటరాజన్ పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

  • మంగళవారం:
    • మధ్యాహ్నం 2 గంటలకు మెదక్
    • సాయంత్రం 5 గంటలకు మల్కాజిగిరి
  • బుధవారం:
    • ఉదయం 11 గంటలకు కరీంనగర్
    • మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్
    • సాయంత్రం 5 గంటలకు పెద్దపల్లి

ఈ సమావేశాలకు మంత్రులు, ఇన్‌చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, ఓడిపోయిన అభ్యర్థులు తదితరులను ఆహ్వానించారు.

Loading

By admin

error: Content is protected !!