వేసవి నేపథ్యంలో కోకాకోలా భారత మార్కెట్‌లోకి కొత్త శీతల పానీయాలను తీసుకురాబోతోంది. గ్లోబల్ స్పోర్ట్స్ డ్రింక్ బాడీ ఆర్మర్ లైట్ (BodyArmorLyte) తొలిసారి భారత్‌కు రానుంది. ఇది కొబ్బరినీళ్లు, ఎలక్ట్రోలైట్స్ కలిగి హైడ్రేషన్‌కు అనుకూలంగా ఉంటుంది. అమెరికాలో బిలియన్ డాలర్ల మార్కెట్‌ను కలిగి ఉన్న ఈ బ్రాండ్‌ను కార్టన్, పెట్ బాటిళ్లలో అందుబాటులో ఉంచనున్నారు.
అలాగే హానెస్ట్ టీ అనే ఆర్గానిక్ టీ బ్రాండ్, విటమిన్ వాటర్ పేరుతో మరో బేవరేజ్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు కోకాకోలా ఇండియా అండ్ సౌత్ వెస్ట్ ఆసియా వైస్ ప్రెసిడెంట్ సందీప్ బజోరియా తెలిపారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టుల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ఉన్న విటమిన్ వాటర్‌ను ఇతర మార్కెట్లకు విస్తరించనున్నారు. అలాగే థమ్స్ అప్, స్ప్రైట్, మాజా వంటి బ్రాండ్లను మరింత విస్తరించనున్నట్లు కంపెనీ పేర్కొంది.