👉SC వర్గీకరణ ఏకపక్షంగా జరిగింది
👉పార్లమెంట్ ద్వారా జరిగే వర్గీకరణ అసెంబ్లీ ద్వారా చేయడం ఒక కుట్ర
👉2011 జనాభా లెక్కల ప్రకారం చేయడం వల్ల ఏం శాస్తీయత ఉంటుంది?
👉బిజేపి రాష్ట్రాలలో ఎక్కడైనా జరిగిందా?
👉మోడీ, చంద్రబాబు ల మెప్పు కోసం దళితుల్ని విభజిస్తావా
👉మాలల జనాభా లో అన్నీ తప్పుడు లెక్కలు
👉న్యాయ పోరాటానికి, రాజకీయ పోరాటానికి సిద్ధం
👉మాలలు రోడ్ల మీదకు రాండి, అడుగడుగునా నిలదీయండని పిలుపు
👉ఎక్కువ కాలం ఈ వర్గీకరణ ప్రక్రియ నిలవదు
👉సూప్రీంకోర్ట్ తీర్పుకు విరుద్ధంగా వర్గీకరణ
👉మాలలకు జరుగుతున్న అన్యాయాలపై త్వరలో గడప గడపకు వెళ్తాం
ఇటీవల అసెంబ్లీ లో ఆమోదించిన SC వర్గీకరణ అంశం పూర్తిగా అశాస్త్రీయమైనదని, సూప్రీంకోర్ట్ తీర్పుకు విరుద్ధంగా వర్గీకరణ చేపట్టారని మాలమహానాడు రాష్ట్ర అద్యక్షులు పిల్లి సుధాకర్ విమర్శించారు. కాంగ్రేస్ పార్టీకి అండగ నిలబడిన మాలలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని వాఫోయారు, వర్గీకరణకు పూర్తిగా మద్దతిచ్చిన బిజేపి ప్రభుత్వం తమ రాష్ట్రాలలో ఎందుకు వర్గీకరణ అమలు చేయడం లేదని ప్రశ్నించారు, ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి తెలియదా అని ప్రశ్నించారు, మోడీ, చంద్రబాబు ల మెప్పుకోసమే రేవంత్ రెడ్డి దళితులను విభజించాడని అన్నారు, వర్గీకరణ ప్రక్రియ 2011 జనాభా లెక్కల ప్రకారం జరగడమే శాస్త్రీయం కాదని అన్నారు. మాలల జనాభా ను పూర్తిగా తక్కువ చేసి చూపించారని అన్నారు.దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మాలలు మరింత పోరాటాలకు రోడ్ల మీదకు రావాలని అన్నారు. మాలమహానాడు గా మాలలకు జరుగుతున్న అన్యాయంపై గడప గడపకు వెళ్ళి పోరాట చైతన్యాన్ని నింపుతామని అన్నారు.
ఈ సమావేశం లో జాతీయ ప్రధాన కార్యదర్శి భైరి రమేష్, రాష్ట్ర కో. ఆర్డినేటర్ బ్యాగరి వెంకటస్వామి, జిల్లా అద్యక్షులు గండేటి చిన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ గోనెల ఆనంద్, జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి మహేందర్, గుడ్ల రవికుమార్, ఆంజనేయులు, బ్యాగరి యాదయ్య, బెండ శ్రీనివాస్, గాజ రవి, హరిప్రసాద్, సూర్య రాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
పిల్లి సుధాకర్
రాష్ట్ర అద్యక్షులు
జాతీయ మాల మహానాడు
తెలంగాణ రాష్ట్ర అద్యక్షులు