కొత్తగూడెం ఏరియా ఐఎన్టియుసి ప్రాతినిధ్య సంఘ స్ట్రక్చర్ కమిటీ సమావేశం జిఎం ఆఫీస్ నందు కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించారు స్ట్రక్చర్ కమిటీ నందు పొందుపరిచిన అంశాలు.
- సింగరేణి వ్యాప్తంగా కొత్తగూడెం ఏరియా అత్యధిక ఉత్పత్తి సాధించడం ముఖ్యపాత్ర పోషిస్తున్న సత్తుపల్లి కార్మికుల కొరకు గతంలో మాదిరిగా కొత్తగూడెం నుండి సత్తుపల్లి కి బస్సు సౌకర్యం మేనేజ్మెంట్ ఏర్పాటు చేయాలి.
- అండర్ గ్రౌండ్ లో ఉన్న జనరల్ మజ్దూర్స్, ఫిట్టర్స్, ఎలక్ట్రిషన్స్ కు సర్ఫేస్ వేకెన్సీ కల్పించి ఫిలప్ చేయాలి.
- కార్మికుడు వారి కుటుంబ సభ్యులకు హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ కు రిఫెరల్ కొరకు వస్తే, రిఫరల్ పేపర్స్ మీద సంతకాల కోసం తిరిగి ఇబ్బంది పడుతున్నారు, హాస్పిటల్లోనే డిజిటల్ సిస్టం ద్వారా పంపించే విధంగా చూడాలి.
- జే.వి.ఆర్, సిహెచ్పి నందు పనిచేస్తున్న ఉద్యోగులకు ఆర్.సి.హెచ్.పి తరహాలో ఇన్సెంటివ్ విధానం అమలు చేయాలి.
- రామవరం నందు పెట్రోల్ బంక్, బ్యాంక్, సూపర్ బజార్లు సత్తుపల్లి, రామవరం, రుద్రంపూర్, గౌతంపూర్ త్రీ ఇంక్లైన్ ఏరియాల నందు ఏర్పాటు చేయాలి, అదే విధంగా సత్తుపల్లి లోని పి.వి.ఎన్, కాలనీ లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి.
- సమంత సి.ఎస్.పి నందు ఉన్నటువంటి లిఫ్ట్ పనిచేయడం లేదు, మరొక లిఫ్టు తో పాటు జేవిఆర్ సి హెచ్ పి నందు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి.
- కన్వీనియన్స్ వెహికల్స్, మైన్స్, ఓ.సి.పి, మరియు డిపార్ట్మెంట్లలో సరిపడినంత వెహికల్స్ లేవు కావున వెహికల్స్ ఏర్పాటు చేయాలి.
- కిష్టారం ఓ.సి.పి లో ఉన్న కార్మికులకు డస్ట్ అలవెన్స్ తో పాటు రేడియం జాకెట్స్, స్లింగ్స్, వైర్లెస్ సెట్స్, డస్ట్ మాస్క్, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి.
- ఏరియాలో ఉన్న మైన్స్,ఓ.సి.పి మరియు డిపార్ట్మెంట్స్ లలో ఖాళీగా ఉన్న వేకెన్సీలను ఫుల్ ఫిల్ చేయాలి.
- కొత్తగూడెం ఏరియాలో 72 మంది కార్మికులు డబల్ క్వాట్టర్స్ కలిగి ఉన్నారు, వేల రూపాయలు పీనల్ రెంట్ కట్టలేని స్థితిలో ఉన్నందున వారికి వన్ టైం సెటిల్మెంట్ గా ఒక అవకాశం ఇవ్వగలరు.
పై తెలిపిన 10 అంశాలను స్ట్రక్చర్ కమిటీ నందు పొందుపరచడం జరిగింది, వాటిపై కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు సానుకూలంగా స్పందించి ఏరియా పరిధిలో పరిష్కరించదగిన సమస్యలను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది, అలాగే కార్పొరేట్ పరిధిలో పరిష్కరించవలసిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.
కార్యక్రమంలో ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్, జిఎం స్ట్రక్చర్ కమిటీ సభ్యులు ఎండి రజాక్, చెన్నకేశవరావు, నాగార్జున, ఎస్ఓటు జిఎం జివి.కోటిరెడ్డి, ఏరియా ఇంజనీర్ కే సూర్యనారాయణ రాజు, ఎజిఎం (సివిల్) సిహెచ్ రామకృష్ణ, ఏజెంట్ పద్మావతి ఖని బి రవీందర్, డీజీఎం(పర్సనల్) బి. శివకేశవరావు, జె.వి.ఆర్ ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎన్ వి ఆర్ ప్రహ్లాద్, డిజిఎం (ఈ & ఎం) జే వి ఆర్ సి హెచ్ పి కే సోమశేఖర రావు, డిజిఎం (ఐ ఈ డి) ఎన్.యోహన్, డిజిఎం (ఈ & ఎం) ఏరియా వర్క్ షాప్ టి శ్రీకాంత్, మెడికల్ సూపర్డెంట్ సార్ ఎం. పరశురాములు, సీనియర్ పిఓలు మజ్జి మురళి, కే దేవదాస్, విజయ సందీప్ పాల్గొన్నారు.