భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా గిరిజన సంఘ నాయకులు కొత్తగూడెం క్లబ్‌లో జరుగుతున్న అవకతవకలపై ఫిర్యాదు చేశారు. పూర్తిగా గిరిజనులు నివసించే ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడెం జిల్లాలో, సింగరేణి, ప్రభుత్వ సహాయంతో స్థానిక ప్రజల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ క్లబ్, క్యాంటీన్‌ను కొంత మంది ప్రైవేట్ వ్యక్తులు తమ స్వప్రయోజనాల కోసం అక్రమంగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

ఈ క్లబ్‌ను ఫంక్షన్ హాల్‌గా మార్చి, కొత్త వారికి సభ్యత్వం ఇవ్వకుండా, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలను నిర్లక్ష్యం చేస్తూ, పేదలకు అందని విధంగా లక్షల నుంచి రెండు లక్షల వరకు కిరాయిలు పెంచారని తెలిపారు. క్లబ్ నిర్వహణలో ఉన్న నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నూతన కమిటీలో ఎస్సీ, ఎస్టీలకు స్థానం లేకపోవడంతో దాన్ని రద్దు చేసి, ప్రభుత్వం లేదా సింగరేణి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మూడు బాలాజీ నాయక్, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు మాలోతు శివ నాయక్, లావుడియా ప్రసాద్ నాయక్, బానోతు దుర్గాప్రసాద్, బట్టు అరుణ్ నాయక్, అశోక్ బాబు నాయక్, జరుపుల లచ్చు నాయక్, భూక్య దేవ్ సింగ్ నాయక్, ధారావత్ రామ్నాథ్ నాయక్, రాంబాబు నాయక్, శ్రీనివాస్ నాయక్, ప్రతాప్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Loading

By admin

error: Content is protected !!