హెడ్ ఆఫీస్ కార్పొరేట్ నందు వెల్ఫేర్ & ఆర్.సి,జి.ఎం గా విధులు నిర్వహిస్తూ ది.31.01.2025 న పదవి విరమణ చేయుచున్న కె.శ్రీనివాసరావు,సింగరేణి సంస్థ నందు వెల్ఫేర్ ఆఫీసర్ గా ఉద్యోగాన్ని ప్రారంభించి, జి.ఎం, వెల్ఫేర్ & ఆర్.సి గా కార్పొరేట్ నందు పదవి విరమణ చేయుచున్న సందర్భంగా సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు, కొత్తగూడెం ఏరియా ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్ ఆధ్వర్యంలో, హెడ్ ఆఫీస్ లోని వారి కార్యాలయంలో వారిని ఘనంగా సన్మానించడం జరిగింది వారు వెల్ఫేర్ ఆఫీసర్ నుండి అంచెలంచెలుగా ఎదిగి సింగరేణి సంస్థ జిఎం వెల్ఫేర్ అండ్ ఆర్ సి గా పదవులు నిర్వహిస్తూ కార్పొరేట్ హెడ్ ఆఫీస్ నందు పదవి విరమణ చేయుచున్న వారికి అభినందనలతో పాటు ఆరోగ్యం మంచిగా ఉండాలని రజాక్ ఆకాంక్షిస్తూ,

ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారు కె.శ్రీనివాస్ రావు కు అభినందనల తోపాటు ఆయురారోగ్యాలు ఉండాలని దేవుని కోరుతున్నామని తెలిపారు, ఈ కార్యక్రమంలో అధికారులు ఐటి జిఎం హరి శంకర్, ఎజిఎం మెయిన్ వర్క్ షాప్ రాజీవ్ కుమార్, ఆఫీస్ సిబ్బంది వరప్రసాద్, శ్రీనివాస్, పాస్ నైట్, కోటేశ్వరరావు,ట్రెజరర్ బీముడు, సెంట్రల్ కమిటీ మెంబర్స్ విప్లవ రెడ్డి, కాసర్ల సమ్మయ్య, ఫిట్ కార్యదర్శిలు,ఎం.డి సత్తార్ పాష,శనిగరపు కుమార్, కే నట్రాజ్, డి శంకర్ బాబు, ఐఎన్టియుసి నాయకులు కలవల శ్రీనివాస్, సీతారామరాజు, యాకుబుద్దీన్, బాబుదిన్, కొప్పుల కుమార్, భాను కమల్, భరత్, చందులాల్, అధర్ శ్రీనివాసరావు ఎస్. ప్రభాకర్, కే కుమార్, సంజయ్, అల్తాఫ్, కాంపల్లి శ్రీనివాస్, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఐఎన్టియుసి నాయకులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు*

Loading

By admin

error: Content is protected !!