1952 నుండి రాజ్యాంగం ఫలాలను ఇవ్వడం మొదలుపెట్టింది. కానీ అప్పటికి దళితుల్లో అర్హులై, ఫలాలు అనుభవించేవారు లేరు. అలాగా సుమారు 18 ఏళ్ళు అంటే 1970 వరకు దళితులు రాజ్యాంగ ఫలాలు అనుభవించలేదనే చెప్పాలి. 1970 నుండి సుమారు 15 ఏళ్ళు కొద్దిగా చైతన్యం పొందిన దళితులు మెల్లమెల్లగా ఎదగడం ప్రారంభం అయింది. చైతన్యం పెరిగేకొద్దీ ప్రశ్నించడం కూడా మొదలైంది. మొదటినుండి బ్రాహ్మణ ఆధిపత్యంలో ఉన్న భూమి, రాజ్యాధికారంను నెయ్యితోనో , భయపెట్టో ఆక్రమించేశారు రెడ్లు, కమ్మలు. దేవుడు పేరుతో అనుభవిస్తున్న బ్రాహ్మణులను అదిరించి , ఎదిరించి , బెదిరించి లాగేసుకున్నారు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ప్రధానంగా రెడ్డి ఆధిపత్యం కోసమే. (ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వెలమల కోసం ఎలాగో అలా ) చేయబడ్డ ఉద్యమం. ప్రత్యేక ఆంధ్రోద్యమంపై శ్రీశ్రీ ” కుడితి నీళ్లు తాగే రెడ్లు…” అని ఎద్దేవా చేశారు. అలా ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన సమయంలో కమ్మలు కూడా ప్రధాన పాత్ర పోషించి రాజ్యధికారం కొరకు పోటీ పడే సందర్భంలో జనాబాపరంగా అత్యధికంగా రెడ్లు ఎక్కువుగా కమ్మలు తక్కువుగా ఉండే తెలంగాణ కలుపుకుని బలపడేందుకు రెడ్లు వేసిన ఎత్తుగడ విశాలాంధ్ర. ఆంధ్రాలో b. n. రెడ్డి, తెలంగాణలో రంగారెడ్డి (ఈయన మొదట వ్యతిరేఖించారు ) మొదలగు వారి వ్యూహంలో కమ్మలు చిక్కుకున్నారు. దీనితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెడ్ల రాజ్యం అయింది.

ఇలాంటి పరిస్థితుల్లో నాదెండ్ల భాస్కరరావు వంటి ఆంధ్రా రాజకీయ నాయకులకు దొరికిన ఆయుధం ఎన్టీఆర్. ఎన్టీఆర్ కు ఉన్న ప్రజాభిమానం, పాపులారిటీ , అప్పటికి రెడ్లు చేతకాని పరిపాలన టీడీపీని సునాసాయంగానే అధికారంలోకి తెచ్చింది. టీడీపీ రాకతో ఆంధ్రుల్లో రాజకీయ, సామాజిక చైతన్యం పెరిగింది. టీడీపీ రావడంతోనే దుష్ట కాంగ్రెస్ రెడ్ల పరిపాలన పోయి దుర్మార్గపు కమ్మ పరిపాలన మొదలైంది. కమ్మలకు ఎక్కడాలేని పొగరు, అహంకారం, అధికారంతో వచ్చిపడింది. ఈ కులహంకారమే కారంచేడు దుర్మార్గానికి ప్రధానకారణం. నిజం చెప్పాలంటే, విశాలాంధ్ర ఏర్పడకపోతే ఇక్కడ రెడ్ల స్థానంలో కాపులు ప్రధానశక్తిగా ఎదిగే అవకాశాలు ఉండేవి. అధికారం రెడ్లు, కమ్మలు మధ్యే తిరుగుతూ ఉండేది కాదు. ఇప్పుడు కాపులు కమ్మ-రెడ్డి మార్గంలో ఉన్నారు.

అప్పటికే చైతన్యంతో ఉన్న దళితులు టీడీపీ అధికారంలోకి వచ్చే సమయానికి మరికొంత చైతన్యం, ఐక్యత కలిగి ఉన్నారు. కారంచేడు మాదిగలు ఆ గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అండగా ఉండేవారు. ఈ క్రమంలో మాదిగల ఆత్మగౌరవం, ప్రశ్నించేతత్వం నచ్చని కమ్మలు ఎన్టీఆర్ వియ్యంకుడు దగ్గుబాటి పురంధేశ్వరి మామ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు తండ్రి దగ్గుబాటి చెంచురామయ్య ముఖ్యపాత్రలో కారంచేడు చుట్టుపక్కల కమ్మలను పోగేసి చేసిన మారణకాండ ఆంద్రప్రదేశ్ ను ఉలిక్కిపడేట్లు చేసింది. కారంచేడు మాదిగలకు మేమున్నాం అంటూ చీరాల , ఒంగోలు, బాపట్ల, నెల్లూరు, పొన్నూరు, తెనాలి..ఇలా ఒకటేమిటి అన్ని ప్రాంతాలనుండి సంఘీభావం తెలిపారు. కత్తి పద్మారావు దళితమహాసభ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమం ఊపందుకుంది. ఈ ఉద్యమంలో మాలలు ముఖ్యపాత్ర పోషించారు. అప్పుడసలు మాల, మాదిగ వేర్వేరు అని చాలామందికి తెలియదు కూడా. SC లేదా హరిజనులు ఇవే పదాలు వినపడేవి. ఆ ఉద్యమంలో భాగంగా మా ఊర్లో యువకులు అనేక కేసులు ఎదుర్కొని జీవితాలు ఫణంగా పెట్టారు. ఉద్యమ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా దళిత చైతన్యం తీవ్రమైంది. ఈ చైతన్యం ఒక్క ఉద్యమ రూపంలోనే కాకుండా విద్యా , ఉద్యోగ, రాజకీయ రంగాలలో ప్రస్ఫుటంగా కనిపించింది. పర్యవసానంగా టీడీపీ, కాంగ్రెస్ కు అధికారం కోల్పోయింది.

అప్పటికే కొద్దో గొప్పో చదువుకున్న మాల IAS, IPS లు కమ్మల పెత్తనాన్ని అధికారికంగా నిలదీశారు. BSP ప్రవేశం కూడా కమ్మలకు కంటగింపు అయింది. మాల మాదిగల ఐక్యత భవిష్యత్తులో ఎప్పటికైనా ప్రమాదమని భావించిన కమ్మలు మనువాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. ఏ ప్రకాశం జిల్లాలో మాదిగలకు బద్ధ శత్రువులుగా చూడబడుతున్నారో అదే ప్రకాశం జిల్లా అదే కారంచేడు గ్రామానికి దగ్గర్లోనే ఈదులుమూడి గ్రామంలో మాదిగలకు గల కమ్మ శత్రుత్వాన్ని మాలలపైకి మళ్లించే ప్రయత్నమే రిజర్వేషన్లు వర్గీకరణ ఉద్యమం. వాస్తవానికి కారంచేడులోనే ప్రారంభించే ప్రయత్నం చేశారు. తర్వాత కారంచేడు బాధితులకు చీరాల మాలలు ఆశ్రయం కల్పించిన పునరావాస కేంద్రం విజయనగర కాలనీలో కూడా ప్రయత్నించారు. వారు ఒప్పుకోలేదు, సరికదా… మాకు మాలల అండ లేకపోతే ఇప్పుడు మేము ఏమైపోయేవాళ్ళమో, వెళ్లిపోండి అని మాదిగ నాయకులను తరిమితే, ఈదులుమూడి గ్రామాన్ని వేదికగా చేసుకున్నారు. నిజంగా మాదిగల వెనుకబాటు కారణంగా ఏర్పడిన ఉద్యమం అయితే అందుకు వేదిక కారంచేడు అయ్యేది కాదు. కారంచేడు వేదిక కావడంలోనే ఆ ఉద్యమ లక్ష్యం, నాయకుల స్వార్ధం, కమ్ముల కుట్ర కనబడుతున్నాయి.

ఉద్యమ నేపద్యం కానివ్వండి, స్థిరమైన కుల వృత్తి లేకపోవడం వలన లేదా క్రైస్తవ మిషనరీ స్కూల్స్ వలన కానివ్వండి
మాలలు చదువునే ఆయుధంగా మలచుకున్నారు. 1970 తర్వాత సుమారు ఒక 10, 15 ఏళ్ళు తిండి తిప్పలకు నోచుకోకుండా కనీసం సొంత ఇళ్లు కూడా లేనప్పటికీ పెళ్లిళ్లు వాయిదా వేసుకుని చదువుకై తమ జీవితాలను దారబోసిన ఫలితంగా విద్యా, ఉద్యోగాల్లో స్థిరపడటం మనం గుర్తించవచ్చు. అనేక కార్యాలయాల్లో ఆధిపత్య కులాలకు చెందిన వారు దళిత అధికారుల ముందు చేతులు కట్టుకోవాల్సి రావడం, అనేకమంది మాల అడ్వకేట్లు కారంచేడు బాధితుల పక్షాన పోరాటం చేయడం…కమ్మ, రెడ్లకు కంటగింపుగా మారింది. ఇలాంటి సందర్భాల్లో కారంచేడు సంఘటన తర్వాత పరిణామాల్లో మాలల పోరాటాలు, వాటికి మాదిగల మద్దతును విచ్చిన్నం చేసే కుట్రే వర్గీకరణ ఉద్యమం. అంటే రిజర్వేషన్లు ఫలాలు 20 ఏళ్ళు కూడా అనుభవంలోకి పూర్తిగా రాకుండానే బేధాలు అనే బీజం వేసారు ఆధిపత్య కులాలు. వర్గీకరణ ఉద్యమం మొదలై ఇప్పటికి 30 ఏళ్ళు. ఈ 30 ఏళ్ళు ఒక పార్టీ మాలలను, మరొకటి మాదిగలను మార్చి , మార్చి వాడుకుంటూ అధికారాన్ని మార్చుకుంటూ వచ్చాయి. ఈ 25 ఏళ్లలో రిజర్వేషన్లు వలన మాలలు పొందింది ఎంతో, మాదిగలు నష్టపోయింది ఎంతోకాని అధికారం వాళ్ళ చేతుల్లో పెట్టి ఇద్దరూ ఆ మాటకొస్తే మిగిలిన bc కులాలు సైతం ఎంతో నష్టపోయాయన్నది నిష్టూర సత్యం.

వాస్తవంగా దళితులు రాజ్యాంగం అమలులోకొచ్చిన మొదటి 20 ఏళ్లు అనుభవించింది శూన్యమనే చెప్పవచ్చు. తర్వాతి 10 ఏళ్లకు వర్గీకరణ ఉద్యమం వచ్చింది. ఈ 10 ఏళ్లలో మాలలు ఎంత లాభపడి ఉంటారు ? అంతే లాభం వర్గీకరణ ఉద్యమం తరువాత ఇద్దరూ పొంది ఉంటారు. కానీ అంతకంటే 10 రెట్లు ఇద్దరూ నష్టపోయారు. అయినా కష్టపడి చదువుకుని తెచ్చుకున్న ఉద్యోగాలు దొంగతనం ఎలా అవుతాయి ?

ఎవరెక్కువ , ఎవరు తక్కువ అని బేరీజులు వేసుకుంటూ ఒక్కో కుల నాయకుడు ఒక్కో పార్టీకి తొత్తుగా మారి బాబాసాహెబ్ అంబేడ్కర్ కలలను కళ్లలోనే కప్పేశారు. నాయకులుగా చెలామణి అవుతూ వారు జాతికేం చేశారో ఇతిమిద్దంగా ఎవరూ చెప్పలేరు, కానీ చేసిన నష్టం, పోగేసుకున్న చిల్లర కాష్టం మాత్రం బాగానే ఉంది. మాలలు ఓ రెండు శాతం అధికంగా ఉద్యోగాలు పొందే ఉండొచ్చు. అయితే…ప్రభుత్వాల ఉద్యోగ ప్రకటనలు ఎన్ని ? సరిగా రిజర్వేషన్లు అమలు చేస్తే ఇంకా బ్యాక్ లాగ్ పోస్టులు ఎందుకున్నాయి ? ఈ 30 ఏళ్లలో ఏ కుల నాయకుడైనా బ్యాక్ లాగ్ పోస్టుల కొరకు ఉద్యమం చేశాడా ? ఏడాదికి బడ్జెట్ ఎంత, దళితుల అవసరాలు ఎంత, బడ్జెట్ లోఎంత కేటాయిస్తున్నారు, నిధులు ఎన్ని విడుదల చేస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు, అందులో బినామీలు ఎంత ? ఎన్ని లక్షల కోట్లు దారి మళ్లుతున్నాయి ? అవి ఎవరి బొక్కసాలు నింపుతున్నాయి..?అసలు దొంగలు ఎవరు ? కుల నాయకులు ప్రారంభంలో ఆస్తిపాస్తులెన్ని ఇప్పుడెన్ని ? వారికి కార్లు , బంగ్లాలు , వారి పిల్లల ఖరీదైన చదువులు, మైంటైనన్సు ఎక్కడినుండి వస్తున్నాయి / వచ్చాయి..?

ఆడిటింగ్ చేసిన తర్వాత దోపిడీదారు లెవరో తేల్చుకుందాం. పరిష్కారాలు దొంగలు , దోపిడీదార్లను చూయిస్తుంటే… మనం చప్పట్లు కొట్టడం.మనం ఎంగిలాకుల్లో పోటీదార్లమే కానీ దొంగలం, దోపిడీదార్లం కాదు, మనకంత సీన్ లేదు, పాలకులు సంపదలో భాగస్వామ్యం ఇవ్వరు కూడా.

ఆలోచిస్తారని ఆశిస్తూ… మీ అల్లాడి పౌల్ రాజ్

మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అద్యక్షులు

Loading

By admin

error: Content is protected !!