31/01/2025 శుక్రవారం ఉదయం 10 గంటలకు ఖమ్మం నగర మందు రామకృష్ణ ఫంక్షన్ హాల్ లో జరిగే మాలల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయండి. మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్ గుంతేటి వీరభద్రం. ఖమ్మం జిల్లా మాల మహానాడు నాయకులకు కార్యకర్తలకు ముఖ్యులకు అభిమానులకు ఆత్మీయ కుల బంధువులందరికీ తెలియజేయునది, మిత్రులారా 31/1/2025 న జరుగు మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రగతిశీల మాల విద్యార్థి సమైక్య తెలంగాణ ఆవిర్భావ సభ కు విద్యార్థులతో పాటు యువకులు సంఘ నాయకులు అందరు కూడా పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మాలల యొక్క సత్తా ఏంటో తెలియజేయాలని ఈ సందర్భంగా మాల మహానాడు ఏసి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్ గుంతేటి వీరభద్రం మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే వివిధ మండలాలలో ఉండబడినటువంటి మండల కమిటీలు గ్రామ కమిటీలు ప్రతి ఒక్కరు కూడా శక్తియుక్తులను ఓడిపి ఖచ్చితంగా చిత్తశుద్ధితో పనిచేయాలని గుంతేటి వీరభద్రం మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గౌరవ శ్రీ జి చెన్నయ్య, వర్ధన్నపేట శాసనసభ్యులు శ్రీ కె.ఆర్ నాగరాజు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ జూపూడి ప్రభాకర్ రావు, గౌరవ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ పి ఎస్ ఎన్ మూర్తి, మరో ఐ ఆర్ ఎస్ అధికారి శ్రీ ఉప్పలేటి దేవి ప్రసాద్, విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ అధికారి శ్రీ పిల్లి బాలరాజు, బహుజన ప్రజా గాయకులు శ్రీ రేంజర్ల రాజేష్, సమతా సైనిక్ దళ్ ప్రధాన కార్యదర్శి శ్రీ డిగాంబర్ కాంబ్లి, మహాసేన అధ్యక్షులు శ్రీ మహాసేన రాజేష్, ఏ ఎం ఎస్ ఏ శ్రీ ,మందాల భాస్కర్, మరియు మాల మహానాడు ప్రధాన కార్యదర్శి మంచాల వెంకటస్వామి తదితరులు పాల్గొని ప్రసంగిస్తారు కావున ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మాలలాత్మీయ బంధువులందరికీ గుంతెటి వీరభద్రం తెలియజేసినారు.

Loading

By admin

error: Content is protected !!