రాజ్యాంగ స్పూర్తికి, ప్రాతినిధ్య అసలు ఉద్దేశానికి మరియు ఉమ్మడి కేంద్ర జాబితా యొక్క ఆలోచనలకు వర్గీకరణ అన్నది వ్యతిరేకం. కావున, వర్గీకరణను మాలలు వ్యతికిస్తున్నారు. వర్గీకరణ అన్నది అశాస్త్రీయం, అహేతుకం మరియు అసంబద్ధం. బలమైన “ఉద్దేశాలు మరియు లక్ష్యాలు” సాధించేందుకు వర్గీకరణ అన్నది అడ్డుగోడలాంటిది, గొడ్డలిపెట్టులాంటిది. ముందు రాజ్యాంగ అసలు ఉద్దేశాలు, లక్ష్యాలు, ధ్యేయాలు మరియు ఆశయాలు నెరవేర్చుకున్న తరువాత.. అప్పటికీ అంతరాలు, అసమానతలు, వెనుకుబాటుతనం, తగినంత ప్రాతినిధ్యంలేకుంటే.. అప్పుడు “”కొసరు”” ఉద్దేశాల, లక్ష్యాల గురించి ఆలోచించాలి. అంతేతప్పా, “”అసలు”” ఉద్దేశాలను మరుగుపరిచి, పక్కనబెట్టి.. కొసరు ఉద్దేశాల జోలికివెళ్ళడం అంటే.. అజ్ఞానం, అవివేకం మరియు మూర్ఖత్వమే అవుతుంది. SC సమూహాలకు అన్యాయం ఏరూపంలో జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది మరియు ఎలా జరిగింది? అన్న విషయాలను లోతుగా చర్చించి, తెలుసుకొని.. వెనుకబాటుతనానికి కారణాలు, కారకులు ఎవరు? తగినంత ప్రాతినిధ్య ఫలాలు ఎందుకు అందుకోలేక, పొందలేకపోతున్నారు? నిజానికి వర్గీకరణ శాశ్వత పరిష్కారం చూపుతుందా? లేక? ఒక చిన్న సమస్యను పరిష్కరించబోయి.. ఒక పెద్ద సమస్యను సృష్టించుకోవడం అవుతుందా? ఇదే వర్గీకరణ పరిష్కారం అనుకుంటే.. దేశంలో మెజారిటీ రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఇత్యాది మౌలికమైన ప్రశ్నలు మనముందరవున్నాయని తెలియజేయకతప్పదు. సుప్రీంకోర్టు భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని 7 గురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మెజారిటీ తీర్పుప్రకారం.. మాలలకే కాకుండా, మాదిగలకు, దేశంలోని 1263 కులాలకు కూడా నష్టదాయకమే. మాదిగలు వాంచించిన, కాంక్షించిన మరియు కోరుకున్న ప్రకారం ఈ తీర్పుతో వర్గీకరణ కల నెరవేరదు మరియు జరగదు.


మాదిగలు కోరుకుంటున్నది.. మాలలతో 26 కులాలతో కూడిన సమూహంతో సంబంధం లేకుండా.. మమ్ములను మాత్రమే 18 కులాలతో కూడిన సమూహంతో ప్రత్యేక గ్రూపుగా, తరగతిగా చేయమని, ఉంచమని మరియు పెట్టమని కోరుతున్నారు. ఈ తీర్పు ప్రకారం అలా కుదరదన్న సంగతి తెలుసుకుంటే మంచిది.
ఎవరైతే నిజంగా “”వెనుకబాటుకు గురైనారో, అన్యాయం జరిగిందో మరియు తగినంత ప్రాతినిధ్యం””లేదో.. వారిని నిర్ధిష్ట వాస్తవిక గణాంకాలు, లెక్కలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని జనగణనశాఖ నివేదికల ఆధారంగా.. రాష్ట్రాలు ముందుకుపోవచ్చు అని, తన అభిప్రాయాన్ని తప్పనిసరికాని అదేశాల రూపంలో ఇచ్చింది. ఇందులో మరో ప్రమాదకర అభిప్రాయాన్ని కూడా క్రిమిలేయర్ రూపంలో 4 గురు మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. ఇప్పుడు చెప్పండి.. ఈ తీర్పు మాదిగలకు న్యాయం చేకూరుస్తుందని ఇప్పటికీ చెప్పగలరా, నమ్మగలరా? నిజంగా మాదిగ సోదరులకు గానీ, ఉత్తరాదిలో ఇక్కడి మాల సమాంతర కులాలకు గానీ అన్యాయం జరిగిందని వాస్తవిక లెక్కలు సంబంధిత శాఖలు బయటపెట్టి.. స్వతంత్ర రాజ్యాంగ సంస్థ (Independent Body) జాతీయ SC కమీషన్ చే ధృవీకరించబడిన తరువాత.. ఉషా మెహ్రా కమిషన్ “”కంక్లూజన్/ముగింపు”” అభిప్రాయంలో పేర్కొన్న ప్రకారం.. ఆర్టికల్ – 341కు క్లాజ్ 3ని చేర్చుకుని పార్లమెంటులో ఆర్టికల్ – 368 ప్రకారం రాజ్యాంగ సవరణ ద్వారా ముందుకెళ్ళచ్చు. అప్పుడు దానిని అమలు చేయమని అడగడం సరైనది. అంతేతప్పా.. అంతకుమించి వేరేమార్గమేలేదని నా జాతి ముద్దుబిడ్డలకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.

ర్థం పర్థంలేని, అశాస్త్రీయ, అహేతుక మరియు అసంబద్ధ.. రాజ్యాంగ స్పూర్తికి, ప్రాతినిధ్య అసలు ఉద్దేశానికి మరియు ఉమ్మడి కేంద్ర జాబితా యొక్క మహత్తరమైన, మహోన్నతమైన ఆలోచనలు సహా గుర్తింపు, గౌరవం.. విలువ, ప్రాధాన్యత మరియు ప్రాముఖ్యతకు వ్యతిరేకమైనది. అంతేకాకుండా.. బలమైన “రాజ్యాంగ మరియు రాజ్యాధికార” లక్ష్యాలకు, కాంక్ష మరియు వాంఛకు వ్యతిరేకమైన, అడ్డుగోడలాంటి, గొడ్డలిపెట్టులాంటి వర్గీకరణను.. నిర్ద్వందంగా, మూకుమ్మడిగా వ్యతిరేకిద్దాం, అడ్డుకుందాం.. మేధావుల ముసుగులో ఇరు సమూహాలను రెచ్చగొట్టి, తమ పబ్బం గడుపుకొనచూస్తున్న స్వయం ప్రకటిత, కుహానా, కురస మరియు సంకుచిత మేధావులకు సైతం తగిన”బుధ్ధి మరియు గుణపాఠం” చెపుదాం.. ఒకే సజాతి సమూహాలుగా వెలుగొందుదాం. అంతేకాకుండా, భారత జాతి ముద్దుబిడ్డలంగా, నిజమైన మరియు స్వచ్చమైన భారతీయులంగా మరియు ఒకే ప్రజలంగా అందరితో కలిసి ఒక ముద్దగా, పిడికిలిగా మరియు సంఘటిత శక్తిగా శాశ్వతంగా, నిత్యనూతనంగా నిలుద్దాం మరియు వర్ధిల్లుదాం.

సంగటి మనోహర్ మహాజన్
వ్యవస్థాపక అధ్యక్షులు,
మహాజన రాజ్యం పార్టీ & రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి

9849509416

Loading

By admin

error: Content is protected !!