సింగపూర్‌లో పర్యటిస్తున్న సీఎం ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆ దేశ పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ ఫూ హైయిన్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు, భాగస్వామ్యాలపై విస్తృత చర్చలు జరిగాయి. పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, నీటి వనరుల నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, సెమీ కండక్టర్లు, పర్యావరణం, సాంకేతికత వంటి రంగాల్లో తెలంగాణ లక్ష్యాలు సింగపూర్ మంత్రిని ఆకర్షించాయి.
నెట్ జీరో ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, నీటి నిర్వహణలో ఉమ్మడి ప్రణాళికలను సింగపూర్ ప్రభుత్వం పరిశీలిస్తుందని హామీ ఇచ్చింది. చర్చల్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భారత డిప్యూటీ హై కమిషనర్ పూజ ఎం.టిల్లు పాల్గొన్నారు. ఇరుపక్షాలు వేగంగా ప్రాజెక్టులను అమలు చేయాలని నిర్ణయించాయి.