నిర్మల్ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు (టీఎస్ 18 టీ 8485) నిర్మల్ నుండి బైంసాకు రాత్రి 7 గంటలకు బయలుదేరింది. బైంసా మండలం దేగామ్ గ్రామానికి చెందిన ఎల్క బాయి లగేజీతో బస్సులో ఎక్కింది. ఆమె పెద్ద మూటను దారిలో అడ్డంగా ఉంచింది. బస్సు కండక్టర్ డీఆర్ స్వామి లగేజీని దారిలో నుంచి తొలగించాలని, లేదంటే బస్సు దిగిపోవాలని సూచించారు. అయితే, మహిళ “నా మూట నా ఇష్టం, ఇక్కడ్నే పెడతా. కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకో” అంటూ ప్రతిస్పందించారు. ఈ సమయంలో కండక్టర్ ఆగ్రహంతో “బస్సు నాదైతే నిన్ను ఇందులో ఎక్కించుకునే వాడిని కాద” అంటూ తీర్పు ఇచ్చాడు. ఇతర ప్రయాణికులు ఈ ఘర్షణను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. ఈ ఘటన ప్రయాణికులందరినీ అసౌకర్యానికి గురిచేసింది.