టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ జనవరి చివరిలోపు నామినేటేడ్, కార్పొరేషన్ల చైర్మన్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 2025 జనవరి 15న ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో జరిగిన సమావేశంలో టీపీసీసీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

🔹 ఫిబ్రవరి 1వ వారంలో రాహుల్ గాంధీ సభ: సూర్యపేట లేదా ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ ఉంటుందని ప్రకటించారు.
🔹 కేబినెట్ విస్తరణ త్వరలోనే: సీఎం రేవంత్ రెడ్డి త్వరలో కేబినెట్ విస్తరణపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
🔹 జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికలు: పార్టీ గెలుపే లక్ష్యంగా సమర్థవంతమైన వ్యూహాలపై దిశానిర్ధేశం చేశారు.
🔹 పీసీసీ కార్యవర్గ కూర్పు: ప్రజాదరణ కలిగిన నేతలకే డీసీసీ పదవులు ఇస్తామని స్పష్టం చేశారు.

మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వం ఏడాది పాలన, రాబోయే ఎన్నికల వ్యూహాలపై దృష్టి పెట్టిందన్నారు.

Loading

By admin

error: Content is protected !!