మహానగరంలో 2050 నాటికి పెరిగే జనాభా నీటి అవసరాలను తీర్చేందుకు మౌలిక సదుపాయాల ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి జలమండలి అధికారులకు ఆదేశించారు. జలమండలి బోర్డు తొలి సమావేశం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగింది.

సమావేశంలోని కీలక నిర్ణయాలు:

  1. సివరేజీ ప్రణాళిక: భవిష్యత్తు అవసరాల కోసం ఏజెన్సీలు, కన్సల్టెన్సీలతో అధ్యయనం చేయాలని ఆదేశాలు.
  2. గోదావరి ఫేజ్-2: 20 టీఎంసీల నీటిని మల్లన్నసాగర్ ద్వారా సరఫరా చేసేందుకు మార్పులకు ఆమోదం.
  3. మంజీరా పైపులైన్ల పునర్నిర్మాణం: కాలం చెల్లిన పైపులైన్ల స్థానంలో కొత్త ఆధునిక పైపులైన్ నిర్మాణానికి ఆదేశాలు.
  4. జలమండలి ఆదాయ వృద్ధి: నూతన ప్రాజెక్టుల కోసం తక్కువ వడ్డీ రుణాలు తీసుకునే మార్గాలపై పరిశీలన.

ఈ సమావేశంలో సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Loading

By admin

error: Content is protected !!