ఇంజినీరింగ్, ఫార్మసీ, ఇతర ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు స్థానికత నిర్ధారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా ఉన్నత విద్యామండలి ప్రొఫెసర్ బాలకృష్టారెడ్డి, కన్వీనర్‌గా సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, సభ్యులుగా ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి ఉన్నారు.

స్థానికత నిబంధనలు:
6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు నాలుగేళ్లు తెలంగాణలో చదివినవారిని స్థానికులుగా పరిగణిస్తారు. 15% కోటాలో తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులకు పోటీ అవకాశం ఉంది.

371 (డి) అధికరణంపై సందేహాలు:
తెలంగాణలో నివసించి ఇతర రాష్ట్రాలకు వెళ్లిన విద్యార్థులు గతంలో కోటా కింద సీట్లు పొందేవారు. ఈ కోటా తొలగిస్తే వారి పరిస్థితిపై ప్రశ్నలు వస్తున్నాయి.

ప్రవేశాల్లో గందరగోళం:
ఎంబీబీఎస్‌ ప్రవేశాల్లోనూ స్పష్టతకు ఈ కమిటీ సమీక్ష చేస్తూ, వారంలో నివేదిక సమర్పించనుంది.

Loading

By admin

error: Content is protected !!