సింగరేణి నోటిఫికేషన్ 02/2022 ద్వారా రిక్రూట్ అయిన 176 జూనియర్ అసిస్టెంట్‌లకు 2023 సంవత్సరానికి సంబంధించి 11 క్యాజువల్ లీవ్స్ మంజూరు చేయటంలో INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారు చేసిన కృషి వల్ల వారికి రావాల్సిన లీవ్‌లు అందించడం జరిగిందని INTUC కొత్తగూడెం నాయకులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.

డిసెంబర్ 18, 2023 న విధులలో చేరిన 176 మంది జూనియర్ అసిస్టెంట్‌లు, కొన్ని కారణాల వల్ల వారి విధులు తాత్కాలికంగా ఆపి, 05 ఫెబ్రవరి 2024 నుండి విధులను పునఃప్రారంభించారు. ఈ సమయంలో, వారికి 15 సిక్ లీవ్లు జమ కాగా, 11 క్యాజువల్ లీవ్స్ మాత్రం జమ కాలేదు. ఈ సమస్యపై వెంటనే స్పందించిన INTUC నాయకులు, యాజమాన్యంతో మాట్లాడి వారికి రావాల్సిన 11 క్యాజువల్ లీవ్స్‌ను వెంటనే అందించారు.

ఈ కార్యక్రమంలో INTUC సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ త్యాగరాజన్, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం, కొత్తగూడెం వైస్ ప్రెసిడెంట్ రజాక్, రాజేశ్వర్ రావు, యూసఫ్ తదితర INTUC నాయకులు పాల్గొని అభినందనలు తెలిపారు. ఈ కృషి ద్వారా, INTUC నాయకులు తమ సభ్యుల సమస్యలు పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించి, వారి ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్ళేందుకు కట్టుబడి ఉన్నారు.

Loading

By admin

error: Content is protected !!