సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, విద్యా రంగ అభివృద్ధి ప్రతీ ప్రభుత్వ లక్ష్యం కావాలని, కానీ కేసీఆర్‌ ప్రాథమిక అంచనాలు మారిపోయాయని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కిల్స్‌ వర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీ, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలతో మార్పుకు ప్రయత్నిస్తున్నారని కొనియాడారు. అయితే పైనుంచి కింది స్థాయి వరకు ఆచరణ ఉండాలన్నారు.

ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, పేదలకు విద్యను అందించకుండా ఉద్దేశపూర్వకంగా కుట్ర చేస్తున్నారంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. పేదలు తమ ఆదాయంలో 90% విద్య, వైద్యానికి ఖర్చు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

భాజపా ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతపై ప్రశ్నిస్తూ, గడిచిన ఏడాది 1000 మంది గురుకుల విద్యార్థులు ఆస్పత్రుల్లో చేరి, 40 మంది మరణించారని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నదన్నారు.

Loading

By admin

error: Content is protected !!