బుధవారం (18-12-2024) కొత్తగూడెం ఏరియాలోని ఏరియా వర్క్ షాప్‌లో క్రిస్టియన్ సోదరులు, వర్క్ షాప్ ఉద్యోగుల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ శాలెం రాజు, డాక్టర్ విక్టర్ వందనం, వైస్ ప్రెసిడెంట్ ఎం.డి రజాక్, వర్క్ షాప్ యాక్టింగ్ హెచ్.ఓ.డి బి.శంకర్, హెచ్.ఓ.డి ఐఈడి యోహన్, హెచ్.ఓ.డి ఫైనాన్స్ సుమలత, వర్క్ షాప్ ఇంజనీర్ టి.అనిల్ తదితరులు హాజరయ్యారు.
జనరల్ మేనేజర్ ప్రసంగం:
ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని, సమిష్టి ఆత్మతో పండుగలను జరుపుకుంటే ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుందని అన్నారు. వర్క్ షాప్ ఉద్యోగుల కృషిని ప్రశంసించారు.
డాక్టర్ విక్టర్ వందనం సందేశం:
ఏసు క్రీస్తు జననం గురించి వివరిస్తూ, సమాజంలో శాంతి, ప్రేమకు ఆయన ప్రతీకగా నిలుస్తారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఫిట్ కార్యదర్శులు ఎండి సత్తార్ పాషా (ఐఎన్‌టీయుసీ), ఎం. మధు కృష్ణ (ఏఐటీయుసీ), సుంకర రామచంద్రరావు (బీఎంఎస్) తదితరులు పాల్గొన్నారు. అనేక ఉద్యోగులు, అప్రెంటీసులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడంతో వేడుక ఎంతో వైభవంగా జరిగింది. సహకరించిన ఉద్యోగులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.