AMC కాలనీలో దళిత ప్రజా సంఘం జిల్లా అధ్యక్షుడు అల్లాడి జయరాజు నేతృత్వంలో జరిగిన సమావేశంలో స్థానికంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ లోపాలపై చర్చించారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అన్యాయం:
జయరాజు మాట్లాడుతూ, రోజువారీ కూలీపై ఆధారపడి జీవించే నిరుపేద దళితులు ఇప్పటికీ అర్హత కలిగినా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పొందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దళితులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కొత్త ప్రభుత్వంలోనైనా ఆశలు నెరవేరుతాయనే అనుకున్నా, ఇళ్ల పంపిణీలో అసమానతలు కొనసాగుతున్నాయన్నారు.

దినసరి కూలీల పరిస్థితి:
రోజువారీ కష్టం చేసుకునే వారు నెలకు ₹3000-₹4000 అద్దె కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 20 ఏళ్లుగా అద్దె ఇళ్లలో నివసిస్తున్న దళితులకు ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా అందలేదని చెప్పారు. దళితుల హక్కులను కాపాడేలా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వానికి డిమాండ్:
ప్రభుత్వం ఈ సమస్యను సీరియస్‌గా పరిగణించి, అర్హులైన నిరుపేద దళితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందించాల్సిన బాధ్యతను నెరవేర్చాలని జయరాజు అన్నారు.

సమావేశంలో పాల్గొన్నవారు:

ఈ కార్యక్రమంలో శాంతి రాజు, చీకటి దశమ్ బాబు, రాజు, బర్ల రామకృష్ణ, దాసరి సామేలు, కొంగ దిలీపు, కొంగ సాగర్, కనకయ్య, యేసు, వినయ్, బన్నీ, వంశీ, రాకేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. దళితుల హక్కుల కోసం వారి సమర్థంగా పోరాడతామని వారు మద్దతు తెలిపారు.

Loading

By admin

error: Content is protected !!