తెలంగాణలో అర్హులైన నిరుపేదలకు ఇండ్లు నిర్మించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్ ను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్క ఇళ్లు కూడా అనర్హులకు చేరకుండా, సాంకేతిక నైపుణ్యం జోడించి ఇండ్ల కేటాయింపు ప్రక్రియ మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు ప్రాధాన్యత ఇవ్వడం, వారికే మొదటి ప్రాధాన్యత కింద ఇండ్లు కేటాయించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

ప్రత్యేక కోటా, రుణ విముక్తి విధానాలు, పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని పేదలకు 5 లక్షల నిధులను అందించి ఇండ్లు నిర్మించేందుకు ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు . ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఇతర ప్రజా ప్రతినిధులు, సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Loading

By admin

error: Content is protected !!