నిన్న పెద్దపల్లి జిల్లాలో జరిగిన యువ వికాసం సభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ, గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, INTUC సెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్, మరియు సంస్థ సీఎండీ శ్రీ బలరాం నాయక్ పాల్గొన్నారు.
సింగరేణి సంబంధిత స్టాల్స్ పరిశీలించిన మంత్రులు, కాంగ్రెస్ పార్టీ రైతులు, యువకులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు మరియు అన్ని వర్గాల ప్రగతికి అంకితమై పని చేస్తున్న పార్టీగా ప్రస్తావించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కష్టపడి గెలిపించినందుకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
అవకాశాల పరంగా, 50,000 పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు రెవెన్యూ, ఎడ్యుకేషన్, ఇరిగేషన్, మెడికల్, ఫారెస్ట్, సింగరేణి, ఇతర ప్రభుత్వ రంగాలలో వచ్చిన ఘనతను కూడా కాంగ్రెస్ పార్టీదే అని పేర్కొన్నారు.
తమ ప్రజలకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇండ్లను, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ద్వారా త్వరలో అందుబాటులో తీసుకువస్తామని తెలిపారు.
సభలో ఐఎన్టీయూసీ నాయకులతోపాటు, నర్సింహారెడ్డి, త్యాగరాజన్, ఆల్బర్ట్, వికాస్ యాదవ్, ఎం.డి. రజాక్, పితాంబర్ రావు, జే. వెంకటేశ్వర్లు, సకినాల సమ్మయ్య, కలవల శ్రీనివాస్, రమేష్, రమాకాంత్ సింగరేణి అధికారులు, ఐఎన్‌టీయూసీ నాయకులు, ఉద్యోగులు, కొత్తగా ఉద్యోగం పొందిన వారి కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.