రిజర్వేషన్ వర్గీకరణ అంశం లాభనష్టాలకు సంబంధించిన అంశం కాదు .ఒకరి సొత్తును ఒకరు దోచుకునే అవకాశం లేదు. అంటరానితనంతో వచ్చిన రిజర్వేషన్లు అంటరానితనంతోనే పోవాలి.
రిజర్వేషన్ల మూడు ప్రధాన విభాగాలు:
1) సామాజిక రిజర్వేషన్లు
2) ఆర్థిక రిజర్వేషన్లు
3) రాజకీయ రిజర్వేషన్లు
సామాజిక రిజర్వేషన్:- రామ్సే మెక్ డోనాల్డ్ అధ్యక్షతన లండన్ లో జరిగిన మొదటి, రెండు మరియు మూడవ సమావేశాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాడి సాధించిన రిజర్వేషన్లు ఈ రిజర్వేషన్లను అడ్డుకునేందుకే 17 సెప్టెంబర్ 1932 నుండి 24 సెప్టెంబర్ పూనా ఒప్పందం వరకు గాంధీ ఎర్రవాడ జైల్లో నిరాహార దీక్ష చేస్తున్న గాంధీ తో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చర్చల సందర్భంలో నన్ను ఆ వీధి స్తంభానికి వేలాడదీసిన సాధించుకున్న హక్కులను వదులుకోనని కరాకండిగా తెలియజేశాడు బాబాసాహెబ్ అగ్రకుల హిందువులతో ఎంతో పోరాటం చేసి సాధించిన హక్కులను పూనా ఒప్పందం లోనీ నిబంధన ప్రకారం వర్గీకరించడం వీలుకాదు.
ఆర్థిక రిజర్వేషన్:- ఈ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగా మరియు ఉపాధిలో కొనసాగే రిజర్వేషన్లు మనము ఎంత ఉన్నత స్థితికి చేరుకున్నప్పటికీ మనలను వీడని అంటరానితనం కులం ఉన్నంత వరకు ఆర్థిక రిజర్వేషన్ లు వర్గీకరిస్తే రాజ్యాంగంలోని మూలసూత్రమైన ప్రతి పౌరునికి విద్య అందజేయడంలో విఫలం అవుతాము ప్రజాస్వామిక లక్ష్యాలకు విఘాతం కలుగుతుంది కావున ఈ రిజర్వేషన్లను వర్గీకరించడం వీలుకాదు.
రాజకీయ రిజర్వేషన్:- లండన్ సమావేశాల ద్వారా సాధించుకున్న రిజర్వేషన్ల లో డాక్టర్ బాబాసాహెబ్ గాంధీకి ఊపిరి పోసే విధంగా సడలించబడ్డ రిజర్వేషన్లే రాజకీయ రిజర్వేషన్లు. ఇవి 10 సంవత్సరాలు మాత్రమే కొనసాగాలి అని పూనా ఒప్పందం. రాజకీయ పార్టీలు ఓట్ల కోసం అధికారం కోసం పూనా ఒప్పంద ఉల్లంఘన చేసి ఈ రిజర్వేషన్ కొనసాగిస్తున్నారు కాబట్టి ఈ రిజర్వేషన్లు వర్గీకరించేందుకు వెసులుబాటు ఉంటుంది దీన్ని కూడా పార్లమెంట్ లో చట్టం చేసి వర్గీకరించాల్సి ఉంటుంది.
దాసరి లక్ష్మయ్య
TGSRTC ఆర్టీసీ మాల ఉద్యోగ సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి