తెలంగాణలో బీజేపీ శాసనసభ్యులు, ఎంపీలు పాల్గొన్న ప్రత్యేక సమావేశం విజయవంతంగా జరిగింది. సమావేశంలో నాయకులు రాష్ట్రంలో పార్టీ వేగంగా విస్తరిస్తోందని, ప్రజలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలనలపై విసిగిపోయి బీజేపీ వైపు ఆశతో చూస్తున్నారని అభిప్రాయపడ్డారు.బీఆర్‌ఎస్ దుష్టపాలన వల్ల ప్రజలు బాధలను ఎదుర్కొంటున్నారని, కాంగ్రెస్‌ ప్రజావ్యతిరేక విధానాలు మరోవైపు అసంతృప్తిని కలిగించాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ తన అభివృద్ధి ఎజెండాతో ప్రజల విశ్వాసం పొందుతుందని స్పష్టం చేశారు.అయితే, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కి వ్యతిరేకంగా బీజేపీ తన రాజకీయ స్వరాన్ని గట్టిగా వినిపిస్తూనే ఉంటుందని, కార్యకర్తలు అన్ని స్థాయిలలో పార్టీని మరింత బలపరుస్తారని నాయకులు తెలిపారు.

Loading

By admin

error: Content is protected !!