మహబూబాబాద్ జిల్లా మానుకోటలో పోలీసుల వ్యవహారంపై మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. “అక్కడ ఎన్నికలు లేవు, గొడవలేమీ జరగలేదు. అయితే లాంగ్ మార్చ్, హెచ్చరికల అవసరం ఏమిటి?” అని విమర్శించారు. శాంతియుతంగా సభ నిర్వహించేందుకు కూడా అవకాశమివ్వకపోవడం దౌర్భాగ్యమన్నారు.”ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది?” అని ప్రశ్నించిన కేటీఆర్, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో పోలీసులు ఎందుకు అంతా కట్టుదిట్టం చేయాల్సి వచ్చింది అనే దాని మీద సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు.ప్రజలు శాంతియుతంగా సభలు నిర్వహించుకోవడంలో అంతరాయాలు సృష్టించటం అన్యాయమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Loading

By admin

error: Content is protected !!