ఈరోజు సేవాలాల్ సేన సమావేశం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగింది ఈ సమావేశానికి ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ మాట్లాడుతూ కొత్తగూడెం పాల్వంచ పట్టణాలు పరిసర గ్రామాలను కలుపుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 177 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు జిల్లా కేంద్రంగా ఏజెన్సీ చట్టాలను తూట్లు పొడుస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా అడుగులు వేయడం వల్ల ఏజెన్సీ గిరిజన ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు ఏజెన్సీ హక్కులను గిరిజన ప్రజలు కోల్పోతారని వారికి రావాల్సిన ఉద్యోగాలు గిరిజన హక్కులు అన్ని కూడా హరిస్తాయని అన్నారు అభివృద్ధికి ఎవరు అడ్డంకి కాదని ఏజెన్సీ ప్రాంతాలుగా ఉన్నా కూడా లక్ష్మీదేవి పల్లి ,చుంచుపల్లి ,సుజాతనగర్ ,మండలాలలో ఉన్న గ్రామాలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ఉన్నాయని అన్నారు చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామపంచాయతీ ఉదాహరణగా తీసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ కంటే ఎక్కువ అభివృద్ధి చెందుతూ వస్తుందని ఈ మండలంలో సీఎంఆర్ షాపింగ్ మాల్స్, జీవి మాల్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్ ,మరెన్నో కార్పొరేట్ సంస్థలు ఏజెన్సీ ప్రాంతంలోనే ఉన్నాయి కాబట్టి అభివృద్ధికి ఏజెన్సీ గ్రామాలు ఏ మాత్రం అడ్డంకి కాదని అన్నారు ఇది కేవలం కుట్రపూరితంగా ఈ గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్ చేసి అక్కడున్న గిరిజన ప్రజల భూములను లాక్కునిందుకే కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
ఏజెన్సీ ప్రాంతాల జోలికి వస్తే తాడో పేడో తేల్చుకోవడనికి సేవాలాల్ సేన వెనుకడుగు వేయదని అన్నారు.
భారత రాజ్యాంగం ఏజెన్సీ చట్టాలను గిరిజన ప్రజల అభివృద్ధి కోసం ప్రత్యేక చట్టాలు ఈ జిల్లాలో అమలౌతున్నాయని,వాటిని కొంతమంది బడాబాబుల అభివృద్ధి కోసం చేస్తున్న ప్రచారం అని అన్నారు.
గిరిజన ప్రజలను అభివృద్ది పేరిట మోసం చేయాలని చూస్తున్న స్థానిక MLA.
5వ షెడ్యూల్ భూభాగంలో ఉన్న ప్రాంతాలు1/70 చట్టం,పీసా చట్టం అమలులో ఉన్న ప్రాంతంలో ఈ చట్టాలకు విరుద్ధంగా ఏజెన్సీ భాగాన్ని అభివృద్ధి పేరిట విధ్వంసానికి పాల్పడటం మానుకోవాలని హెచ్చరించారు.
మున్సిపల్ కార్పొరేషన్ వలన ఏజన్సీ గిరిజన ప్రజలకు ఎలాంటి లాభమో తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.ఏజెన్సీ 5వ షెడ్యూల్ ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్ చేయడం వలన స్వయం 100 రోజుల ఉపాధి, ఐటీడీఏ, ద్వారా వచ్చే అభివృద్ధి పథకాలు సర్పంచ్ ,ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు ,ఎంపీపీ, వంటి పదవులతో పాటు వివిధ రకాల ఉద్యోగాలు గిరిజన ప్రజలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని, పీసా చట్టం ప్రకారం పీసా గ్రామ సభల ద్వారా చేసే అభివృద్ధి కార్యక్రమాలకు కూడా కోల్పోతారని అన్నారు.
కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు చుంచుపల్లి, లక్ష్మీదేవి పల్లి,సుజాతనగర్, పాల్వంచ మండలాల లోపల కొన్ని ఏజెన్సీ గ్రామాలను కలుపుకొని మున్సిపల్ కార్పొరేషన్ చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని హెచ్చరించారు.
లేనియెడల దశల వారిగా ఉద్యమాలు ఆందోళనలు కార్యక్రమాలకు సేవాలాల్ సేన తీసుకుంటుoదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్ జిల్లా అధికార ప్రతినిధి బానోతు నాగరాజు నాయక్ రాందాస్ నాయక్ రాజేందర్ నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు