ఈరోజు సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ అధ్యక్షతన జిల్లా గ్రంథాలయం ఎదురుగా జీవో నెంబర్ 29 రద్దు పరచాలని రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు జీవో నెంబర్ 29 వల్ల గ్రూప్ వన్ అభ్యర్థులకు విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ కులాల వారికి అన్యాయం జరుగుతా ఉందని అన్నారు ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారానే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అన్నారు గ్రూప్ వన్ పరీక్షలు ఈనెల 21వ తేదీ నుంచి నిర్వహించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 29 తీసుకువచ్చి ఈ రాష్ట్రంలో అగ్రవర్ణాలకు పట్టం కట్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని అన్నారు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ గ్రూప్ వన్ అభ్యర్థులు హైకోర్టులో దాదాపుగా 20 కేసుల వరకు వేసి ఉన్నారు కానీ వాటిని ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా హడావిడిగా ఈ గ్రూపు వన్ పరీక్షలను ఎలాగైనా నిర్వహించాలని పట్టుదలతో ముందుకు వెళ్లడం చాలా సిగ్గుచేటు ఒకవైపు అభ్యర్థులు హైకోర్టులో వేసిన కేసులు క్లియర్ అయిన తర్వాతనే గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించాలని ధర్నాలు రాస్తారోకోలు చేస్తా ఉంటే మరోవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకోవడం కోసం అభ్యర్థులను బలి చేస్తా ఉన్నదని అన్నారు.
అగ్రవర్ణాలకు ఈ రాష్ట్రంలో ఆరు శాతం ఉన్నవారికి10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు తరతరాలుగా దోపిడీకి గురైన కులాలకు సామాజికంగా వివక్షతకు గురి అయిన కులాలకు విద్యాపరంగా సామాజికంగా వెనుకబడిన కులాలకు రాజ్యాంగ నిర్మాత లు సామాజిక కోణంలో సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఏర్పాటు చేసింది రిజర్వేషన్ ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకు దక్కకుండా చేస్తున్నారుఈ ఈ ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ ఉపయోగించుకొని నేటి వరకు ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో వారందరినీ ఈ డబ్ల్యూ ఎస్ సర్టిఫికెట్లను వెరిఫై చేయాలి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఈ డబ్ల్యూ ఎస్ టిక్కెట్లు జారీ చేశారా లేదా అని నిగ్గు తేల్చాలి ఆక్రమంగా సర్టిఫికెట్ పొందిన వారికి ఉద్యోగం నుంచి తొలగించి క్రిమినల్ చర్యలు చేపట్టాలి ఆ సర్టిఫికెట్ జారీ చేసిన వారిపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నేటి వరకు వారు పొందిన జీతభత్యాలను రికవరీ చేయాలి ఆయా స్థానాలలో ఉద్యోగాలు కోల్పోయిన ఎస్సీ ఎస్టీ బీసీ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు జరుగుతున్న నష్టాన్ని నివారించాలంటే ఒకటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ అమలు నిలిపివేసి పాత విధానాన్ని కొనసాగిస్తూ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్ జిల్లా అధికార ప్రతినిధి బానోతు నాగరాజు నాయక్ జూలూరుపాడు మండల అధ్యక్షులు బానోతు లక్ష్మణ్ నాయక్ పవన్ రమేష్ నాయక్ పవన్ నాయక్ దేవేందర్ నాయక్ సురేష్ నాయక్ బాలు నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు