సుప్రీంకోర్టు పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6Aను రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటుగా సమర్థిస్తూ కీలక తీర్పును వెలువరించింది. 5 న్యాయమూర్తుల ధర్మాసనంలో నలుగురు న్యాయమూర్తులు సెక్షన్ 6Aకు మద్దతు తెలుపగా, జస్టిస్ పార్థీవాలా వ్యతిరేకించారు. ఆయన అభిప్రాయం ప్రకారం, విదేశీయులు పౌరసత్వం పొందినా వారిని పదేళ్ల వరకు ఓటరు జాబితాలో చేర్చడం కుదరదని స్పష్టం చేశారు.
సెక్షన్ 6A 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం చేర్చిన సవరణ ద్వారా పౌరసత్వ చట్టంలోకి వచ్చింది. 1966 నుండి 1971 మధ్య అస్సాంలోకి బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారికి పౌరసత్వం కల్పిస్తూ ఈ సెక్షన్ ప్రవేశపెట్టబడింది. అస్సాంలో వలసదారుల సమస్యను పరిష్కరించడానికి ఈ సెక్షన్ కీలకంగా భావించబడింది. 1966 ముందు వచ్చిన వలసదారులు స్వయంచాలకంగా పౌరసత్వాన్ని పొందారు, కానీ 1966-71 మధ్య వచ్చిన వారికి పౌరసత్వం ఇచ్చినా, 10 సంవత్సరాల కాలానికి ఓటరు హక్కు నిరాకరించబడింది.ఈ సెక్షన్ చట్టబద్ధతను సవాలు చేస్తూ గతంలో కేసులు దాఖలు కాగా, సుప్రీంకోర్టు ఈసారి దీన్ని రాజ్యాంగబద్ధమైనదిగా సమర్దించింది.