భారతమాల పరియోజన ప్రథమ దశలో రాష్ట్రానికి మంజూరైన 7 జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర రహదారులు, రవాణా శాఖ తాజాగా పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టులు గతంలోనే మంజూరైనా, టెండర్ ప్రక్రియకు బ్రేక్ పడింది. ప్రస్తుతం, మొత్తం ప్రాజెక్టులు ఏకకాలంలో ప్రారంభించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ కార్యదర్శికి ఈ మేరకు లేఖ పంపింది.

ఈ ప్రాజెక్టులు మొత్తం 384 కిలోమీటర్ల పొడవున నిర్మించబడుతుండగా, ఖర్చు మొదట రూ. 6,646 కోట్లుగా అంచనా వేయగా, ఇప్పుడు దాన్ని రూ. 6,280 కోట్లకు తగ్గించారు.

  • కొండమోడు-పేరేచెర్ల విస్తరణ
  • ఎన్‌హెచ్‌ 167 ఏజీలో 49.917 కిలోమీటర్ల మార్గాన్ని రూ. 881.61 కోట్లతో నాలుగు వరుసలుగా విస్తరణ.
  • ఎన్‌హెచ్‌ 167కెలో సంగమేశ్వరం-నల్లకాలువ, వెలిగొండ-నంద్యాల మధ్య 62.571 కిలోమీటర్ల రహదారి రెండు వరుసలుగా రూ. 601 కోట్ల వ్యయంతో విస్తరణ.
  • ఎన్‌హెచ్‌ 440లో వేంపల్లి-చాగలమర్రి 78.95 కిమీ విస్తరణకు రూ. 1,321 కోట్లు.
  • ఎన్‌హెచ్‌ 716జిలో ముద్దనూరు-హిందూపురం మార్గం 33.58 కిమీ రూ. 808 కోట్లతో విస్తరణ.

Loading

By admin