తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ JAC ఆధ్వర్యంలో కాజిపేట ELS రైల్వే కాలనీ కూడలిలో భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి 120 వ,, జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది,
ముందుగా వారి విగ్రహానికి పూలమాలవేసి వారి పాదాలచెంత విడిపూలను సమర్పించిన వారి జయంతి ని పురస్కరించుకొని వక్తలు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు భారతదేశ ప్రధమ రైల్వే శాఖమంత్రిగా ఉన్న ఒకానొక సమయంలో రైలు ప్రమాదం జరిగినపుడు వారు రైల్వే మంత్రిత్వశాఖకు బాధ్యత వహిస్తూ మంత్రిపదవికి రాజీనామ చేసారని…! భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశంలో ఆహరకొరత ఏర్పడినపుడు ఇతర దేశాలలో నుండి ఆహారదాన్యాలను దిగుమతి చేసి దేశ ప్రజలకు ఆహారాన్ని అందించడమే కాక దేశానికి వెన్నముఖ రైతేనని దేశ రక్షణకు జవాన్ కాపలా ఉంటే… దేశ ప్రజలకు కడుపునింపేవాడు కిసాన్ అని జై జవాన్…! జై కిసాన్…!! నినాదం ఇచ్చారాని…

ఇతరదేశాలు భారతదేశానికి ఒక పొట్టివాడు చేతకాని ప్రధానిని ఎన్నుకున్నారని హేళన చేసినా వారు దానిని చిరున్నావ్వుతో సమాధానం ఇచ్చి పాకిస్తాన్ తో యుద్ధం వస్తే కాశ్మీర్ బాడర్లో మీలాటరీ టెంట్ల కింద ఉంది యుద్ధం పూర్తి అయ్యేవరకు అక్కడే ఉండి మనదేశ మీలాటరీ సైన్యానికి దైర్యం గా నిలబడి యుద్ధంలో గెలిచి పొట్టివాన్ని కాదు గట్టివాన్ని అని సరైన సమాధానం ఇచ్చిన మహానుభావుడు అని భారతదేశానికి ప్రధాన మంత్రి గా చేసినప్పటికి… ఒక స్వంత ఇళ్ళుకూడ లేని నిజాతి పరుడని అలాంటి నిజాయితీ పరులగురించి ఈ తరాలకు తెలియచేయాలనీ వారి మార్గంలో అందరూ నడవాళని అన్నారు, ఈ కార్యక్రమం లో తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ JAC కన్వీనర్ : దేవులపల్లి రాఘవేందర్, చైర్మన్ : కోండ్ర నర్సింఘారావు, రిటైర్డ్ రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ సెక్రెటరీ : గుర్రపు సుధాకర్, M.K. మూర్తి, A. శ్రీనివాస్,వి. నాగేష్, P.రవీందర్, వి. తిరుపతి, D. రవీందర్, P. రమేష్, ఎప్నేజర్, G. రాజలింగం, T. సారయ్య, B. శివ, కరుణాకరా చారీ, నాగపూరి రాజయ్య, D. వెంకట్, అమరనాథ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Loading

By admin