అక్టోబర్ 1వ తేదీ నుండి దేశంలో అనేక కీలక మార్పులు జరుగనున్నాయి. రోజువారీ అంశాలకు తోడు ఆర్థిక సంబంధిత విషయాలు మరియు కొన్ని ప్రభుత్వ పథకాలలో మార్పులు వస్తున్నాయి. బ్యాంకుల క్రెడిట్ కార్డ్ నిబంధనలు, ఎల్పీజీ సిలిండర్ ధరలు, సుకన్య సమృద్ధి యోజన (SSY), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఆధార్ కార్డ్ వంటి పొదుపు పథకాలతో సంబంధించిన అంశాలలో మార్పులు ఉంటాయి. ఈ నెల ముగింపు నేపథ్యంలో రేపటి నుంచి జరిగే మార్పుల గురించి తెలుసుకుందాం.

ఎల్పీజీ గాస్ సిలిండర్ ధర:

ప్రతి నెలా ఒకటో తేదీన చమురు మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను సవరించే ప్రక్రియ జరుగుతుంది. అక్టోబర్ 2024 కొరకు సవరించిన ధరలను అక్టోబర్ 1 ఉదయం 6 గంటలకు ప్రకటించనున్నారు. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు తరచూ మారుతున్నప్పటికీ, 14 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఎన్నికలు మరియు ఇతర రాజకీయ కారణాల దృష్ట్యా వంట గ్యాస్ ధరలను పెంచడానికి ఆయిల్ కంపెనీలు హెచ్చుకోలేదు.

ఆధార్ కార్డు నిబంధనల మార్పు:

ఆధార్ నంబర్ స్థానంలో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడిని ఉపయోగించడం అనుమతించే నిబంధనను కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిలిపివేసింది. ఈ నిర్ణయం అక్టోబర్ 1 నుండి అమల్లోకి రానుంది. ఇకపై పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్ కార్డ్) సంబంధిత పత్రాలలో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీని చూపించాల్సిన అవసరం లేదు.

పీపీఎఫ్ నియమం మార్పు:

అక్టోబర్ 1, 2024 నుండి తప్పు వివరాలతో ఉన్న పీపీఎఫ్ ఖాతాలు మరియు ఇతర చిన్న పొదుపు పథకాల క్రమబద్ధీకరణకు సంబంధించిన కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మైనర్‌ల పేరుతో తెరిచిన ఖాతాలను, బహుళ పీపీఎఫ్ ఖాతాలను మరియు ఎన్ఆర్ఐ పీపీఎఫ్ ఖాతాలను క్రమబద్ధీకరించేందుకు అవకాశం లభిస్తుంది.

ఇన్‌కమ్ ట్యాక్స్ నిబంధనల మార్పులు:

కేంద్ర బడ్జెట్ 2024లో ఇన్‌కమ్ ట్యాక్స్‌కు సంబంధించి ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పుల్లో కొన్ని అక్టోబర్ 1 నుండి అమలులోకి రానున్నాయి. టీడీఎస్‌లో గణనీయమైన మార్పు మంగళవారం నుంచి జరుగుతుంది. కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ నియమాల ప్రకారం, నిర్దిష్ట కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ బాండ్లపై 10% టీడీఎస్ వర్తించనుంది. అదనంగా, జీవిత బీమా పాలసీ, ఇంటి అద్దె చెల్లింపు వంటి వాటికి సంబంధించిన టీడీఎస్ చెల్లింపులు కూడా మార్చబడతాయి.

HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నిబంధనల మార్పు:

స్మార్ట్ బై ప్లాట్‌ఫారమ్‌లో ప్రతి త్రైమాసికంలో యాపిల్ ఉత్పత్తుల కోసం రివార్డ్ పాయింట్ల రిడెంప్షన్‌ను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరిమితం చేసింది.

Loading

By admin