ఈరోజు 28-09-2024 శనివారం ఉదయం 10:30 గం:లకు తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ భవనం, విద్యానగర్ కాలనీ, కొత్తగూడెం లో జిల్లా మహిళా,శిశు,దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ వారు 25-09-2024 నుండి 01-10-2024 సీనియర్ సిటిజన్స్ డే వారోత్సవాలు లో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందిఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ తరపున శ్రీ నరేష్ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ హక్కులు వివరించారు. ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ను కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేస్తే సంక్షేమశాఖ దృష్టి కి తీసుకొని రావాలి అని వారికి తగిన న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కొల్లు నాగేశ్వరరావు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ కు సంబంధించిన అన్ని హక్కులు, వైద్య సేవలు అందించే లా సంక్షేమ శాఖ అధికారులు కృషి చేయాలని తెలిపారు.
సెక్రటరీ సురేష్ కుమార్ గారు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ కు బ్యాంకుల వద్ద హాస్పిటల్ లలో సీనియర్ సిటిజన్స్ కు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు . సభ్యులు శ్రీ Dr శ్రీ బత్తుల కృష్ణయ్య మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ శారీరక, మానసిక ఒత్తిడి కి గురి కాకుండా ఆరోగ్యం కాపాడుకోవాలని కోరారు, రిటైర్ ప్రిన్సిపాల్ శ్రీ ప్రసన్న కుమార్ గారు సీనియర్ సిటిజన్స్ కూడా ప్రతి సంవత్సరం ఇన్ కం టాక్స్ పరిధి లో ఉన్న లేకున్నా సబ్మిట్ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో రిటైర్ ITI ప్రిన్సిపాల్ శ్రీ సందీప్, శ్రీ నరసింహారావు, సాహితీ,సీనియర్ సిటిజన్స్ సభ్యులు శ్రీ పాండురంగారావు, శివ రామక్రిష్ణ,కామేశ్వరరావు, మైనేని నాగేశ్వరరావు, గురుమూర్తి, రాజేంద్రప్రసాద్,కేశవరావు, ధర్మారావు, మోహన్ లాల్,విజయ మోహన్, నసీరుల్లా RP జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు