తేదీ. 27.09.2024 న కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ గారి కార్యాలయము నందు స్వర్గీయులు ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి వేడకను నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జిఎం గారు మాట్లాడుతూ ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడని అలాగే స్వాతంత్ర ఉద్యమాలలో నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారని, తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా తృణపాయంగా వదిలేసి నిబద్ధత కలిగిన రాజకీయవేత్త, రాష్ట్ర చేనేత సహకారం రంగానికి కూడా చేశారని తెలియజేశారు.
96 సంవత్సరాల వయసులో కూడా చలిని లెక్క చేయకుండా ఢిల్లీలోని జంతర్ మంతర్ లో తెలంగాణ కోసం దీక్ష చేశారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయమని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం కొరకు వారు అహర్నిశలు కృషి చేశారని అనేక సమ్మెలలో కూడా పాల్గొన్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిఎం గారితో పాటు ఎస్ ఓ టు జిఎం జి.వి. కోటి రెడ్డి, ఏఐటియుసి వైస్ ప్రెసిడెంట్ కొత్తగూడెం ఏరియా, కే. రాములు, ఐఎన్ టి యు సి వైస్ ప్రెసిడెంట్ కొత్తగూడెం ఏరియా ఎండి. రజాక్, కొత్తగూడెం ఏరియా అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ ఏ ఉపేంద్ర బాబు, ఎజిఎం(ఫైనాన్స్) కే హనా సుమలత, డిజిఎం (పర్సనల్) బి. శివ కేశవరావు, డీజీఎం (ఐఈడి) ఎన్.యోహాన్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ఏం వెంకటేశ్వరరావు, ఎన్విరాన్మెంట్ ఎస్.ఓ.ఎం టి.సత్యనారాయణ, డివై. పిఎం ఎం. శ్రావణ్ కుమార్, సీనియర్ పిఓ ఎం. మురళి, సీనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్ బి. తౌరియా, జిఎం ఆఫీస్ ఫిట్ సెక్రటరీలు కే.సౌజన్య, సిహెచ్ సాగర్ మరియు జిఎం కార్యాలయంలోని ఇతర ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు.
డిజిఎం (పర్సనల్), కొత్తగూడెం ఏరియా.