కార్మిక ప్రాంతమైన రామవరం నందు కమ్యూనిటీ హాల్ లో జరుగుతున్న ఆధునికరణ పనులను పర్యవేక్షించిన కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్,మరియు ఐఎన్టియుసి నాయకులు పాల్గొని, ఏదైతే కమ్యూనిటీ హాల్ నందు ఆధునీకరణ పనులను శుభకార్యాలకు అవసరాల నిమిత్తం నిర్మాణం శర వేగంగా జరుగుతున్నాయి, కానీ ఇంకా కొన్ని పనుల ను నిర్మించాల్సిన అవసరం ఉన్నవి, దీని గురించి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ శాలెం రాజు గారి దృష్టికి తీసుకెళ్లామని ముఖ్యంగా బౌండరీ చుట్టూ వాల్ పై మేష్ ఏర్పాటు చేయాలి, వాష్ బేసిన్ ఏరియాలో ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేయాలి, కోతులు రావడానికి అవకాశం ఉంది, అలాగే దొంగలు వాటర్ ట్యాపులు ఎత్తుకుపోయే అవకాశం ఉంది.

ఎంట్రన్స్ నందు రెండవ గేట్ ఏర్పాటు చేయాలి, ఆవులు జంతువులు రాకుండా క్యాటిల్ గార్డ్ ఏర్పాటు చేయాలి, కిచెన్ పక్కన స్టోర్ రూమ్ ఏర్పాటు చేయాలి, డైనింగ్ మరియు కిచెన్ మధ్యలో చిన్న బిట్టు ఫ్లోరింగ్ చేయించాలి, ఓపెన్ స్టేజి నందు ఓపెన్ షెడ్ వేయించాలి, స్టేజ్ ముందు రెండు లైటింగ్ కొరకు టవర్స్ ఏర్పాటు చేయాలి, స్టేజ్ ముందున్న ఓపెన్ ప్లేస్ లో లెవెలింగ్ చేయించి మొత్తం ఫ్లోరింగ్ చేయించాలి, అలాగే కమ్యూనిటీ హాల్ నందు ఏ/సీలు ఏర్పాటు చేయాలని, త్వరగా కమ్యూనిటీ హాల్ కార్మిక కుటుంబాలకు అందుబాటులో తేవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి నాయకులు బూటిక రాజేశ్వరరావు,ఎస్కే గౌస్, ఎండి సత్తార్ పాష, ఏం అశోక్, సిహెచ్ కుమార్, ఎం కొమురయ్య, తిరుపతి, రహీం, బింగి గోపాల్, పూర్ణ, భాను కమల్, జానీ పాషా, ప్రసాద్, మహమ్మద్ జానీ, రాజేందర్, కొండలు, రాంధాని, శ్రీకాంత్ శర్మ, నరేష్, జోగేశ్వరరావు, శేఖర్, మిత్రులు, శ్రేయోభిలాషులు, తదితరులు పాల్గొన్నారు

Loading

By admin