దేశవ్యాప్తంగా బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 వరకు కూల్చివేతలు చేపట్టవద్దని ఆదేశించింది. సుప్రీం, తదుపరి ఉత్తర్వులు వచ్చినంత వరకు బుల్డోజర్ చర్యలను నిలిపేయాలని స్పష్టం చేసింది. అయితే, ఈ ఆదేశాలు రైల్వే లైన్ల విస్తరణ, జలవనరుల పరిరక్షణ, ఫుట్‌పాత్, రోడ్ల విస్తరణ వంటి ప్రాజెక్టుల కోసం చేపట్టే కూల్చివేతలకు వర్తించవని కోర్టు స్పష్టంచేసింది.
ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో అనధికార నిర్మాణాలను కూల్చివేయడానికి బుల్డోజర్ చర్యలు ప్రారంభించడంతో పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం, తాత్కాలికంగా ఈ చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.