హిందూ సంప్రదాయంలో ఉపవాసం అంటే ఆధ్యాత్మిక శుద్ధి, శరీర శుద్ధి, మరియు భక్తి వ్యక్తీకరణకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఆచారం. పండగలు, ప్రత్యేక రోజుల్లో ఉపవాసం చేయడం వల్ల శరీరం, మనసు శుద్ధి అవుతుందని హిందువులు నమ్ముతారు. పండగల సమయంలో ఉపవాసం చేయడం దైవానికి సమర్పణ, కృతజ్ఞతలను చూపించడానికి ఒక సాధనంగా భావిస్తారు,ఉపవాస ఫలితాలు చూద్దాం.

ఉపవాసం చేయడం వలన వివిధ అవయవాలలో కలుగు మార్పులు

  • జీర్ణక్రియ – జీర్ణావయవాలకు మంచి విశ్రాంతి లభించును . అజీర్ణము తొలగించి ఆకలి వృద్ది అగును.
  • మలాశయం – మలాశయంలోని మురికి బహిష్కరించబడి అజీర్ణం తొలగును . క్రిములను , బ్యాక్టీరియాలను నాశనం చేయును .
  • మూత్రపిండములు – మూత్రపిండములలోని విషపదార్ధములు , రాళ్లు బయటకి వెడలును .
  • ఊపిరితిత్తులు – ఉపిరితిత్తులోని నంజు , నీరు బహిష్కరించబడి ఆయాసము నివారించును . శ్వాసక్రియ చక్కగా జరుగును .
  • గుండె – గుండె చుట్టు , లోపల చేరిన కొవ్వు , నీరు తగ్గి గుండె చక్కగా కొట్టుకొనును . అధికంగా తినడం వలన రక్తంలో కొలెస్టరాల్ ఎక్కువ అయ్యి గుండెజబ్బులు వచ్చును .
  • లివర్ , స్ప్లీన్ – ఆహారం జీర్ణం అగుటకు ఇవి ముఖ్యముగా పనిచేయవలెను . ఉపవాసం చేయుట వలన వీటికి విశ్రాంతి దొరుకును . వాటిలో మాలిన్యాలు తొలగించబడి జీర్ణక్రియ వృద్ధిచెందును .
  • రక్తప్రసరణ – రక్తదోషములు నివారణ జరుగును. ఉపవాసం వలన రక్తప్రసారం చురుకుగా జరుగును. కావున తిమ్మిర్లు , మంటలు , నొప్పులు నివారణ అగును.
  • కీళ్లు – కీళ్లలో పేరుకుపోయిన కొవ్వు , నీరు , మాంసం , ఇతర మాలిన్యాలు తొలగించబడి వ్యాధి నివారణ అగును.
  • నాడి మండలము – ఉపవాసం వలన నాడీ మండలం శుద్ది జరిగి వ్యాధి నివారణ జరుగును.
  • జ్ఞానేంద్రియములు – జ్ఞానేంద్రియాలలోని మాలిన్యములు కూడా నివారణ అగును.
  • చర్మము – చర్మము కాంతివంతం అగును. చర్మవ్యాధులు హరించును . శరీరానికి చక్కని రంగు వచ్చును .
  • మనస్సు – మనస్సు నిర్మలం అగును. కోపతాపములు నివారించును . ఆధ్యాత్మిక చింతనకు పునాదులు ఏర్పడును .

    రసోపవాసం

    కేవలము పండ్లరసాలతో చేయు ఉపవాసాన్ని రసోపవాసం అంటారు. ఈ ఉపవాసమును వారంరోజులు మొదలుకుని నెలరోజుల వరకు కూడా చేయవచ్చును . ఈ రసోపవాసములో ముఖ్యముగా నిమ్మరసం , పలుచని నారింజరసం , బత్తాయిరసం , కమలారసం , తేనెనీళ్ళు , కొబ్బరినీళ్లు , బార్లీనీరు మొదలగునవి రోజుకి 3 నుండి 5 సార్లు రోగిని అనుసరించి ఇవ్వవలెను .

    ఫలోపవాసం

    ఉపవాసం చేయలేనివారికి ఫలోపవాసం చేయించాలి . కేవలం రసముతో నిండిన ఫలములు మాత్రమే ఆహారముగా ఇవ్వవలెను . ఫలహారము అని అరటిపండ్లు తినరాదు. ఎక్కువుగా బత్తాయి , నారింజ , కమలా , ద్రాక్ష , అనాస , దానిమ్మ , మామిడి , పుచ్చ మొదలగు పండ్లను తినవచ్చు . ఫలోపవాసం రోగిని అనుసరించి 10 రోజుల నుండి 40 రోజుల వరకు ఉంచవచ్చు. ఇప్పుడు మీకు రసోపవాసం చేయు విధానం గురించి వివరిస్తాను . ఒక గ్లాసు మంచినీటిలో ఒక నిమ్మకాయ పిండి దానిలో రెండు చెమ్చాలు స్వచ్చమైన తేనె కలుపుకుని తాగవలెను . దీనినే నిమ్మరసం అంటారు. కాని నిమ్మరసం అనగా గ్లాసు నిండా చిక్కని నిమ్మరసం పిండుకొని తాగరాదు. పైన చెప్పిన నిమ్మరసం రోజుకి 4 నుంచి 5 సార్లు చేయవచ్చు . ఉదయం 7 గంటలకు , 10 గంటలకు , మధ్యాహన్నం 1 మరియు 3 గంటలకు , సాయంత్రం 6 గంటలకు అనగా ప్రతి రెండు లేదా మూడు గంటలకు ఒకసారి నిమ్మరసం తీసుకోవచ్చును . ప్రతి రసానికి మధ్యన ఒక గ్లాసు మంచినీరు తప్పక తాగవలెను . రోజుకి 5 సార్లు రసం తాగలేనివారు ఉదయం , మద్యాహ్నం , సాయంత్రం మూడు సార్లు తీసికొనవచ్చు. ఈ ప్రక్రియను అనుభవ వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవడం చాలా మంచిది .

ఉబ్బసవ్యాధులు కలిగినవారు మొదట నిమ్మరసం తాగుటకు భయపడుతుంటారు. కాని ఉపవాసంలో నిమ్మరసం త్రాగినట్లైనా ఆయాసం పెరగదు సరికదా తగ్గును. అవసరం అయినచో వేడినీటిలో నిమ్మకాయ పిండుకుని ఉదయం , సాయంత్రం వేడివేడిగా తాగవచ్చు . మధ్యహ్నం మాత్రం చన్నీటిలో తాగవలెను .

ప్రేవులలో పుండు,పొట్టలో పుండు,అమీబియాసిస్ వ్యాధితో బాధపడేవారు నిమ్మరసంతో ఉపవాసం చేయరాదు.వీరు పలుచటి మజ్జిగతోగాని ఉపవాసం చేయవలెను.రోగి చిక్కి బలహీనంగా ఉన్నచో పలచని పాలతో కూడా ఉపవాసం చేయవచ్చు. 

మూత్రపిండ వ్యాధులలో బార్లినీటితో కాని, పచ్చికొబ్బరి నీటితోగాని ఉపవాసం చేయించవచ్చు. దీనివలన మూత్రం చక్కగా విసర్జించబడి మూత్రకోశ వ్యాధులు త్వరగా నయం అగును. నిమ్మకాయలు దొరకని సమయంలో ఆయా ఋతువుల్లో లభించే బత్తాయి , కమల , నారింజ రసములను పలుచగా చేసి రోజుకు 3 సార్లు ఇవ్వవచ్చు. 

ఫలోపవాసం చేయు విధానం

ఉదయం 8 గంటలకు నిమ్మరసం , 10 గంటలకు రసముగల పండ్లు , మధ్యహ్నం 3 గంటలకు నిమ్మరసం మరియు సాయంత్రం 6 గంటలకు పండ్లు తీసుకోవాలి . ఈ విధముగా ఫలోపవాసం చేయవలెను . పండ్లే కదా అని అధికంగా తినరాదు. ఫలోపవాసము నందు మంచినీరు కూడా బాగా తాగినచో మలబహిష్కరణ మంచిగా జరుగును. 

కాళహస్తి వేంకటేశ్వరరావు

అనువంశిక ఆయుర్వేద వైద్యులు

     9885030034

Loading

By admin