TG: తెలంగాణలో వర్షాలు, వరదలతో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి బుధవారం కేంద్ర బృందం రాష్ట్రానికి రానుంది. ఎన్డీఎంఏ అడ్వైజర్, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన బృందం, ఖమ్మం, మహబూబాబాద్, ఇతర ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. బృందంలో కేంద్ర ఆర్థిక, వ్యవసాయ, రోడ్లు, గ్రామీణాభివృద్ధి, రిమోట్ సెన్సింగ్ శాఖల అధికారులు ఉంటారు. వరద బాధితులు, అధికారులతో చర్చించి నష్టాన్ని అంచనా వేసి, నివేదికను కేంద్రానికి సమర్పిస్తారు.

Loading

By admin

error: Content is protected !!