TG: వరదల వల్ల ఇల్లు కూలిన లేదా దెబ్బతిన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారంతో పాటు ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామన్నారు. తడిచిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. కీలక దస్త్రాలు తడిగిన వారు ఆందోళన చెందొద్దని, పీఎల్‌లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో భారీ వర్షాల వల్ల తీవ్ర నష్టం, ఇప్పటివరకు 33 మంది మృతి చెందారు. ఖమ్మం జిల్లాలో 6, కొత్తగూడెంలో 5, ములుగులో 4, కామారెడ్డిలో 3, వనపర్తిలో 3 మంది మృతిచెందారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఇళ్లు కూలిన లేదా దెబ్బతిన్న వారికి ఇందిరమ్మ ఇల్లు మరియు ప్రతి కుటుంబానికి రూ. 16,500 ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

Loading

By admin