బెంగళూరు రామేశ్వరం పేలుడు కేసులో NIA చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఐసిస్‌ ఆల్‌ హింద్‌ గ్రూప్‌కు చెందిన ముసవిర్‌, మతీన్‌, మునీర్‌, షరీఫ్‌లపై అభియోగాలు మోపింది. నిందితులు డార్క్‌వెబ్‌ ద్వారా పరిచయాలు పెంచుకుని, ఐసిస్‌ సౌత్‌ ఇండియా చీఫ్‌ అమీర్‌తో కలిసి కుట్రలు పన్నారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ రోజున పేలుళ్లు, బెంగళూరులోని బీజేపీ కార్యాలయంపై దాడి, దేశవ్యాప్తంగా పలు దాడులకు కుట్ర చేశారని NIA పేర్కొంది. టెలీగ్రామ్‌ యాప్‌ ద్వారా నిందితులు టచ్‌లో ఉండి దాడులు ప్లాన్‌ చేసినట్లు వెల్లడించింది.

Loading

By admin