హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్‌ బాధ్యతలు స్వీకరించారు. రెండోసారి ఈ పదవి చేపట్టడం తనకు సంతోషంగా ఉందని, ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్‌ నిర్మూలనపై సీరియస్‌గా ఉందని, ముఖ్యంగా డ్రగ్స్‌ మరియు గంజాయి వ్యాప్తి పూర్తిగా అరికట్టేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. అలాగే, నగరంలో క్రిమినల్ కార్యకలాపాలను నియంత్రించేందుకు ఉక్కుపాదం మోపుతామన్నారు. శాంతిభద్రతలను మరింత మెరుగుపర్చడం, ప్రజలకు భద్రతా భావన కలిగించడం తన ప్రధాన లక్ష్యంగా ఉంటుందని సీవీ ఆనంద్‌ స్పష్టం చేశారు.

Loading

By admin

te Telugu
error: Content is protected !!