పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) ప్రజలు భారత్‌లో కలవాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. పీవోకే ప్రజలను సొంత మనుషుల్లా చూసుకుంటామని, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వారి మద్దతు పొందుతామని అన్నారు. జమ్మూ కశ్మీర్‌లో 370 అధికరణ రద్దు తర్వాత భద్రత పెరిగిందని, యువతా చేతుల్లో లాప్‌టాప్‌లు, కంప్యూటర్లు వచ్చాయని వివరించారు. 370 పునరుద్ధరణ అసాధ్యమని, భాజపా ఉన్నంతవరకు అది జరగదని స్పష్టం చేశారు.

Loading

By admin

error: Content is protected !!