హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్టీఎల్ (ఫ్లడ్‌ ఫ్లోర్‌ లెవల్) మరియు బఫర్‌జోన్‌లో అనుమతి లేకుండా నిర్మించిన కొత్త గృహాలను మాత్రమే కూలుస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. ఇప్పటికే నిర్మించబడి, నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చబోమని స్పష్టం చేశారు. బఫర్‌జోన్‌ మరియు ఎఫ్టీఎల్‌ పరిధిలో ఇళ్లు లేదా స్థలాలు కొనుగోలు చేయొద్దని ప్రజలకు సూచించారు. ఈ నిర్ణయంతో నివాసితులు కొంత ఊరట పొందగా, భవిష్యత్తులో కొత్త నిర్మాణాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక చేశారు.

Loading

By admin