రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయ్యింది. కవిత బెయిల్ విషయంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలను ధర్మాసనం తీవ్రంగా తప్పు పట్టింది. ఈ రోజు ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా ఈ అంశం ప్రస్తవనకు వచ్చింది. రేవంత్ వ్యాఖ్యలను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యత గల స్థానంలో ఉన్న సీఎం కోర్టు తీర్పుపై వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. పొలిటికల్ కామెంట్స్‌కు తాము భయపడమని స్పష్టం చేసింది. మా డ్యూటీ మేం చేస్తామని తెలిపింది.ఈరోజు ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది

Loading

By admin

error: Content is protected !!