హైదరాబాద్ లో అక్రమంగా కట్టుకున్న పెద్దల కట్టడాలు కూల్చడం సంతోషమే, కానీ సామాన్యులను ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఊరుకోం.. హీరో లాగా ఫోజులు కొట్టే పద్ధతి మంచిది కాదు. 1956 లో ఈ రాష్ట్రం ఏర్పడితే 40 ఏళ్లు ఏలిన పార్టీ కాంగ్రెస్, ఈనాడే పుట్టింది కాదు. చెరువుల చుట్టూ ఉన్న పట్టా భూముల్లో కట్టుకున్న పేదల ఇల్లు కూలుస్తమని సాహెబ్ నగర్, సరూర్ నగర్, ఫాక్స్ సాగర్ లో కట్టుకున్న ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కరెక్టేనా అని రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను. నీతివంతమైన స్వచ్ఛమైన స్టబన్ గా ఉండే అధికారి అని చెప్తున్నారు. గతంలో పర్మిషన్ ఇచ్చిన అధికారులు కూడా మీవారే అని మర్చిపోకు.

కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అయ్యప్ప సొసైటీలో భూములకు కూల్చే ప్రయత్నం చేసి మళ్లీ తోక ముడిచారు. ఆ తరువాత ఏం జరిగిందో చూశాం. ప్రజల సమస్యలను పరిష్కరించే నమ్మకం లేక, వాటి మీద చర్చించే వెసులుబాటు లేక ప్రజల్ని డైవర్ట్ చేయడానికి హైడ్రాను ముందు పెట్టారు. తప్పకుండా ప్రజలు దీనిపై ఆలోచన చేస్తున్నారు. దమ్ముంటే ప్రభుత్వమే పూడ్చిన చెరువుల మీద చర్యలు తీసుకోండి. బతకమ్మ కుంటను పూడ్చింది ప్రభుత్వం కాదా ? ప్రభుత్వం పూడ్చివేసిన చెరువులు ఎన్ని లెక్క తేల్చాలి. సామాన్యుడిని నష్టపోనివ్వము.

Loading

By admin