Bandhan Bank

మహిళా ఖాతాదారుల కోసం ‘అవని’ పేరిట ప్రత్యేక పొదుపు ఖాతాను ఆవిష్కరించినట్లు బంధన్‌ బ్యాంక్‌ వెల్లడించింది. ఈ ఖాతాదారులకు ప్రత్యేక డెబిట్‌ కార్డు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి అనుబంధంగా రూ.10లక్షల విలువైన వ్యక్తిగత ప్రమాద బీమా, కార్డు పోతే రూ.3.5 లక్షల లయబిలిటీ, ఉచితంగా విమానాశ్రయ లాంజ్‌ ప్రవేశం, లాకర్‌ అద్దె, బంగారం రుణాల ప్రాసెసింగ్‌ ఫీజులపైన రాయితీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతోపాటు బంధన్‌ బ్యాంక్‌ డిలైట్‌ అనే పథకాన్నీ బ్యాంక్‌ ప్రారంభించింది. దీనికింద ఖాతా తెరిచిన వారికి డిలైట్‌ పాయింట్ల పేరిట రివార్డులు అందిస్తుంది. ఈ పాయింట్లను కొనుగోళ్ల కోసం వినియోగించుకోవచ్చు. బ్యాంకు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ రెండు పథకాలనూ ప్రారంభిస్తున్నట్లు తాత్కాలిక మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈఓ రతన్‌ కేశ్‌ తెలిపారు

Loading

By admin

error: Content is protected !!