వసతి గృహాల్లో ఆహార నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. శనివారం నాడు రఘునందన్ మహేశ్వరంలో మాట్లాడుతూ..హాస్టళ్లలో, గురుకులాల్లో మధ్యాహ్న భోజనం కోసం సరఫరా ఐన బియ్యం, నాణ్యత విషయంలో తగిన జాగ్రత్తలు, ప్రమాణాలు విధిగా పాటించాలని స్పష్టం చేశారు. ప్రతి హాస్టల్ ను క్షుణ్ణంగా తనిఖీ చేసి, బియ్యంను తగిన భద్రతతో నిల్వ చేస్తున్నారా లేదా ఆన్న విషయంలో సమగ్ర నివేదిక అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఒక వేళ మిడ్ డే మీల్స్ బియ్యం నాణ్యత లేకపోతే, వండటానికి పనికి రావు అనుకుంటే వాటి బదులు వేరే సన్న బియ్యం ఇచ్చే అవకాశం ఉందని రఘు రఘునందన్ సూచించారు. విద్యార్దులు ఇంటిని మరచి వచ్చి, హాస్టళ్లలో, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉంటున్నారని వారికి అందజేసే ఆహారం కూడా ఇంట్లో వండినట్టే ఉండాలని అభిప్రాయ పడ్డారు.